TTD MULLS ‘’SADGAMA’’- AN INNOVATIVE PROGRAMME AIMED AT INCULCATING HUMAN VALUES AMONG STUDENTS _ విద్యార్థులలో మానవ విలువలను పెంపొందించే వినూత్న కార్యక్రమం ”సద్గమయ”
TIRUPATI, 02 JUNE 2025: With an aim to inculcate ethical values taught by Hindu Sanatana Dharma among the students who are the future pillars of the nation, TTD has mulled an innovative programme, Sadgamaya-a path towards righteousness which will be implemented soon.
In connection with this, a review meeting was held by the TTD JEO Sri Veerabrahmam in the Conference Hall of TTD Administrative Building in Tirupati on Monday.
TTD JEO Sri Veerabrahmam instructed the concerned that the programme should be developed in such a way that it should enhance the spirit of tolerance, empathy, honesty, compassion, confidence, self-discipline among the students. He also directed that the training schedule should include group activities, community service and many more.
Earlier, the HDPP Secretary Sri Sriram Raghunath explained the JEO the intention behind the programme through a Power Point Presentation stating that the progamme aims at laying a strong moral foundation among the students, in their character development, fostering social and emotional skills, love-affection-gratitude towards parents and teachers, compassion, integrity and thereby making the students the true and responsible citizens of the country. He said the programme will commence with the students of TTD schools initially.
All Projects Special Officer Sri Raja Gopal, SE Sri Manoharam, DEO Sri Venkata Sunil, VGO Smt Sada lakshmi, CMO Dr Narmada, Additional HO Dr Sunil, DE Electrical Smt Saraswati, OSD SVBC Smt Padmavati and other officers were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
విద్యార్థులలో మానవ విలువలను పెంపొందించే వినూత్న కార్యక్రమం ”సద్గమయ”
తిరుపతి, 2025, జూన్ 02: దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులలో హిందూ సనాతన ధర్మం బోధించి నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో టీటీడీ త్వరలో సద్గమయ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోనిసమావేశ మందిరంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సోమవారం ఈ కార్యక్రమంపై అధికారులతో సమీక్షా నిర్వహించారు.
విద్యార్థులలో సహనం, సానుభూతి, నిజాయితీ, కరుణ, విశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వంటి అంశాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అంశాలను
శిక్షణ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన ఆదేశించారు.
ముందుగా హెచ్ డి పీపీ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ప్రధాన అంశాలను వివరించారు. విద్యార్థులలో నైతికత, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవ, నైపుణ్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల ప్రేమ- ఆప్యాయత- కృతజ్ఞత, కరుణ, సమగ్రతలను పెంపొందించడం ద్వారా విద్యార్థులను దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని వివరించారు. ఈ కార్యక్రమం మొదటగా టిటిడి పాఠశాలల విద్యార్థులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆల్ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ రాజ గోపాల్, ఎస్ ఈ శ్రీ మనోహరం, డిఈవో శ్రీ వెంకట సునీల్, వీజీవో శ్రీమతి సదా లక్ష్మి, సిఎంవో డాక్టర్ నర్మద, అదనపు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, డిఈ ఎలక్ట్రికల్ శ్రీమతి సరస్వతి, ఎస్వీబీసీ ఓఎస్డీ శ్రీమతి పద్మావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది