TTD MULLS SRI VENKATESWARA PAVITRA UDYANAVANAM AT TIRUMALA _ తిరుమ‌ల‌లో ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలు ఏర్పాటు – టిటిడి ఈవో

Tirumala, 4 Dec. 20: To enhance the aesthetic value of green precincts in Tirumala, TTD has mulled to develop Sri Venkateswara Pavitra Udyanavanam on the lines of the green gardens with auspicious plants as mentioned in the 38th Chapter of Varaha Puranam. 

TTD EO Dr KS Jawahar Reddy along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti on Friday inspected Gita gardens, Padmavathi Area, Dharmagiri Area, Silathoranam etc.in Tirumala. The EO said the Pavitra Udyanavanams should represent the glory and the purpose of the incarnation of Lord as Venkateswara on Venkatachala in Kaliyuga as stated in Varaha Purana. 

He also instructed the Engineering officials to complete the Hard scape part to develop greenery at Gita Park and Padmavathi area while the GMR constructions will do the Soft scaping and maintenance.

Later he also visited Kakulakonda area to see the possibilities of erecting Solar Plants to an extent of nearly 20acres of land for Tirumala utilities. The EO also inspected the Narayanagiri Gardens area.

CE Sri Ramesh Reddy, SE 2 Sri Nageswara Rao, DFO Sri Chandrasekhar, Garden Superintendent Sri Srinivasulu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలు ఏర్పాటు – టిటిడి ఈవో

 తిరుమల,  2020 డిసెంబ‌రు 04: భూలోక నంద‌న వ‌నంగా భాసిల్లుతున్న తిరుమ‌లలో పురాణాల‌లో పేర్కొన్న విధంగా శ్రీ‌వారి సేవ‌కు వినియోగించే ‌మొక్క‌లతో ప‌విత్ర ఉద్యాన‌వ‌నాలు త్వ‌ర‌లో ఏర్పాటు చేయునున్న‌ట్లు ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని  వివిధ‌ ప్రాంతాలలో ఉన్న ఉద్యాన‌వ‌నాల‌ను ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి శుక్ర‌వారం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ వ‌రాహ‌పురాణంలోని 38వ అధ్యాయంలో పేర్కొన్న విధంగా స‌ప్త‌గిరులలోని శ్రీ వెంక‌టాచ‌లంపై వెల‌సి ఉన్న ‌స్వామివారు భ‌క్తులకు కోరిన వ‌రాలు ప్ర‌సాదించే క‌ల్ప‌వృక్షంగా, కామ‌ధేనువుగా, చింతామ‌ణిగా భాసిలుతున్న‌ట్లు పేర్కొన‌డం జ‌రిగింద‌న్నారు.

వ‌రాహ‌పురాణంలో పేర్కొన్న విధంగా దాదాపు 10 ఎక‌రాల విస్తీర్ణంలో పూల మొక్క‌ల‌ను పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో ఏడు ఆకులు క‌లిగిన అర‌టి చెట్లు, తుల‌సి, ఉసిరి, మోదుగ‌, జువ్వి‌, జ‌మ్మి, ద‌ర్భ‌, సంపంగి, మామిడి, పారిజాతం, క‌దంబం, రావి, శ్రీ‌గంథం, అడ‌వి మ‌ల్లి, మొగ‌లి, పున్నాగ‌, అశోక‌, పొగ‌డ‌, య‌ర్ర గ‌న్నెరు‌, తెల్ల గ‌న్నెరు ఉన్నాయి. వీటితో పాటు నాబి, మాదిఫ‌ల‌, బొట్టుగు‌, భాందిరా వంటి వృక్షా‌లను కూడా అభివృద్ధి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. తెలియ‌జేశారు.

తిరుమ‌ల‌లోని జిఎన్‌సి టోల్ గేట్ వ‌ద్ద గ‌ల గీతా ఉద్యాన‌వ‌నం, శ్రీ ప‌ద్మావ‌తి వ‌స‌తి స‌ముదాయాల వ‌ద్ద ఐదు ఎక‌రాల‌ను జిఎంఆర్ స‌హ‌కారంతో టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం, అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వివ‌రించారు. నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, శిలాతోర‌ణంను ప‌రి‌శీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అదేవిధంగా తిరుమ‌ల విద్యుత్ అవ‌స‌రాల‌కు ధ‌ర్మ‌గిరి అటవీ ప్రాంతంలో 20 ఎక‌రాల‌లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలిపారు.  

ఈవో వెంట సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సిఇ శ్రీ ర‌మేష్‌‌రెడ్డి, ఎస్ ఇ – 2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, గార్టెన్ విభాగం డెప్యూటీ డైరెక్ట‌‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, డిఎఫ్‌వో శ్రీ చంద్ర శేఖ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.