TTD NETS RS 1.36CR IN E- HAIR AUCTIONS_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.1.36 కోట్లు

Tirumala, 5 October 2017: The TTD today recorded a unique e-sale for Rs.1.36 crore of the tonsured hair donated by the devotees as part of their vow during its monthly e-auction. The tonsured hair is e-auctioned on first Thursday of every month.

The e-auction was conducted in the presence of the Tirumala JEO Sri KS Sreenivasa Raju and a total of 4400 kgs of of hair of category-1, 2,3,4,and 5 were sold on e-auction platform.

The fist variety-31 inches and 2nd variety of 16-30 inches, third variety of 10-15inches, fourth category of 5-9 inches and fifth last variety of less than five inches were offered on e-auction platform managed by the MSTC agency, Visakhapatnam.

There was no sale in the first variety of 8800 kgs placed for auction at Rs.22, 494 per kg.

The 500 kgs of second variety out of a total of 48,900 kgs was sold Rs.17223 per kg with an earning of Rs.86.11 lakhs.

In the third category only1600 kgs out of 24,500 kgs was sold at Rs, 2833 per kg earning a Rs., 45.41 lakhs.

In the fourth category 300 kgs out of 1700 kgs were sold at Rs.1194 per kg earning Rs.3.59 lakhs

In the last category only 2000 kgs out of the 1.53,00 kgs were sold at Rs.24 per kg earning just Rs.48, 000.

Similarly white hair of 6300 kgs were offered for sale but there was no buyer on the e-platform.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.1.36 కోట్లు

అక్టోబరు 05, తిరుమల, 2017: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.1.36 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 4,400 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.

కిలో రూ.22,494/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 8,800 కిలోలను వేలానికి ఉంచగా ఏవీ అమ్ముడుపోలేదు.

కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 48,900 కిలోలను వేలానికి ఉంచగా 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.86.11 లక్షల ఆదాయం సమకూరింది.

కిలో రూ.2,833/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 24,500 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 1,600 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.45.41 లక్షల ఆదాయం లభించింది.

కిలో రూ.1,194/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 1700 కిలోలను వేలానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.3.59 లక్షల ఆదాయం వచ్చింది.

కిలో రూ.24/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 1,53,000 కిలోలను వేలానికి ఉంచగా 2000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.48 వేల ఆదాయం సమకూరింది.

కిలో రూ.5,462/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 6,300 కిలోలను అమ్మకానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.