TTD NOTIFIES SAMPANGI PLANT AS STHALA VRUKSHAM OF TIRUMALA _ తిరుమలక్షేత్రం ” స్థల వృక్షంగా సంపంగి ” మొక్క
TIRUMALA, 11 NOVEMBER 2021: Based on its historical significance, predominance and importance in all the rituals performed in the temple of Sri Venkateswara Swamy, TTD has recognized and notified, Sampangi-Magnolia champaca as the Sthala Vruksham of Tirumala.
In the recent times, TTD under the instructions of Executive Officer Dr KS Jawahar Reddy has developed Sampradaya Gardens in Tirumala which included the flowering plants and trees as mentioned in various Puranas that have a mention about Tirumala.
Among the divine flowers which adorn Sri Venkateswara Swamy during every day rituals, Sampangi scientifically known as Magnoia champaca, plays a pivotal role.
In fact the 33 and 34 shlokas from Chapter 13 of Bhavishyottara Puranam says that Sri Srinivasa Himself advised Emperor Tondaman not to remove the Sampangi Vanam while constructing the Prakaram.
Even today, the 30-feet Prakaram (wall) between Nadimi Padikavili Gopuram and Maha Dwara Gopuram is called Sampangi Prakaram.
Keeping in view the importance of Sampangi flower in the offerings of Tirumala temple, it is notified that Sampangi is Sthala Vruksham of the Temple Town of Tirumala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమలక్షేత్రం ” స్థల వృక్షంగా సంపంగి ” మొక్క
తిరుమల, 2021 నవంబరు 11: చారిత్రక, ఆచార వ్యవహరాలలో ప్రాముఖ్యత ఆధారంగా, తిరుమలక్షేత్రం ప్రాశస్త్యాన్ని అనుసరించి “స్థల వృక్షంగా సంపంగి ” -మాగ్నోలియా చంపకను టిటిడి గుర్తించింది.
ఇటీవలి కాలంలో ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలలో సంప్రదాయ ఉద్యానవనాలను టిటిడి అభివృద్ధి చేసింది. ఇందులో తిరుమల గురించి వివిధ పురాణాలలో పేర్కొన్న విధంగా పూల మొక్కలు మరియు చెట్లను ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ పూజాదికాల సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామిని అలంకరించే దివ్య పుష్పాలలో, శాస్త్రీయంగా మాగ్నోలియా చంపక అని పిలువబడే సంపంగి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
పురాణ ఆధారాలను అనుసరించి భవిష్యోత్తర పురాణంలోని 13వ అధ్యాయంలోని 33 మరియు 34 శ్లోకాలు ప్రాకారం శ్రీవారికి ఆలయాన్ని నిర్మించేటప్పుడు సంపంగి వనాన్ని తొలగించవద్దని సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుడే స్వయంగా తొండమాన్ చక్రవర్తికి సూచించాడని తెలియజేస్తున్నది.
నేటికీ, నడిమి పడికావిలి గోపురం మరియు మహా ద్వార గోపురం మధ్య 30 అడుగుల ప్రాకారం (గోడ) సంపంగి ప్రాకారం అని పిలువబడుతున్నది.
తిరుమల ఆలయ పూజ కైంకర్యాలలో ఈ పుష్పం యొక్క ప్రాధాన్యతను మరియు చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, సంపంగి తిరుమలక్షేత్రం యొక్క వృక్షంగా గుర్తించడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.