TTD PRESENTS SILKS TO TIRUTTANI _ తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టిటిడి సారె
Tiruttani, 26 Jul 19: On the auspicious occasion of Adikrittika, TTD EO Sri Anil Kumar Singhal has offered silk vastrams to the presiding deity of Sri Tanikesan at Tiruttani in Tamilnadu on Friday.
The famous shrine of Lord Sri Subrahmanya Swamy located in Tamilnadu is one of the most important pilgrim centres dedicated to the Lord.
Speaking on this occasion, TTD EO said, the Lord as Tanikesan draws lakhs of pilgrims every year especially on the day of Adikrittika. TTD has been offering vastrams to the deity since 2006 and I am fortunate to offer the same for the fourth consecutive year. Our team of officers including Tirumala Special Officer Sri AV Dharma Reddy has come here to present the Pattu Vastrams to Sri Tanikesan on behalf of Lord Venkateswara”, he added.
Earlier on their arrival, TTD officers were given warm reception by the District Collector Smt Mageswari Ravikumar, Fit person Sri Jayashankar, Temple In-charge EO and Joint Commissioner Sri Gyanasekaran. Later they had darshan of the main deity.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టిటిడి సారె
తిరుమల, 26 జూలై 2019 ; తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం సమర్పించారు. టిటిడి ఆధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి మాగేశ్వరి రవికుమార్, తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్ శ్రీ జయశంకర్, టెంపుల్ ఇన్‌ఛార్జి ఈవో, జాయింట్ కమిషనర్ శ్రీ జ్ఞానశేఖరన్ ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనదని తెలిపారు. ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి తన ఇరువురు దేవేరులలో ఒకరైన శ్రీ వళ్ళీని పరిణయం ఆడినట్లు పురాణ ప్రశస్త్యమన్నారు. టిటిడి 2006 నుండి ఆడికృతికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తుందని, వరుసగా 4వ సారి కూడా దీనిని అందించడం నా అదృష్టమన్నారు.
చారిత్రక ప్రాశస్త్యం :
భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనది. ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తన ఇరువురు దేవేరులలో ఒకరైన శ్రీ వళ్ళీని పరిణయం ఆడినట్లు పురాణ ప్రాశస్త్యం . తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ”ఆరుపడైవీడు” లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.
ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృతిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.