TTD PROPERTIES GETS PROTECTION _ రూ. 14.8 కోట్ల విలువచేసే టిటిడి ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు

Tirupati, 24 Jan. 21: The immovable assets of TTD located at various places in Tirupati got a foolproof protection cover with Signboards and fencing arrangements having made by the TTD Engineering wing under the instructions of Smt. Sada Bhargavi, Joint Executive Officer of Health & Education of TTD, who also took charge of the Estates wing.

During her recent inspections she observed that there is no proper fencing and signboards with TTD Logo and details available at TTD Properties and Lands. 

She directed officials concerned to take immediate action of erecting the fencing and signboards at all TTD Properties to protect them from encroachments. 

A Task Force Team consisting staffs from Estates, Engineering and Vigilance & Security Departments visited the places and erected proper Fencing and signboards.

Among the 22 venues eight properties are located at Bairagipatteda and Kesavayanagunta while the remaining 14 properties at Vaikuntapuram and M.R.Palli areas.

The extent of the area of these immovable properties is 54, 728.87sq.ft with a market value of around Rs.14.80crores.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

రూ. 14.8 కోట్ల విలువచేసే టిటిడి ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు

తిరుప‌తి,  2021, జనవరి 24: టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి ఆదేశాల మేరకు తిరుపతిలోని టిటిడి ఆస్తులకు, ఖాళీ స్థలాలకు అధికారులు ఆదివారం రక్షణ ఏర్పాట్లు చేశారు.

జెఈవో ఎస్టేట్ విభాగం పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుపతిలోని ఆస్తులను తనిఖీ చేశారు. టిటిడి ఆస్తులు, ఖాళీగా ఉన్న స్థలాల వద్ద ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా వెంటనే రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి చీఫ్ ఇంజనీర్ కు, ఎస్టేట్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇంజినీరింగ్, ఎస్టేట్ విభాగం, భద్రతా విభాగాల సిబ్బందితో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. జెఈవో ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం టిటిడి ఆస్తులకు కంచెను ఏర్పాటు చేసి, టిటిడికి చెందినవిగా గుర్తించేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భైరాగిపట్టెడ, కేశవాయనగుంట, వైకుంఠపురం, ఎంఆర్ పల్లిలో 22 ఆస్తులు కలిపి రూ 14.8 కోట్ల మార్కెట్ విలువ చేసే 54, 728.87 చదరపు అడుగుల ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.