TTD RELEASES BRAHMOTSAVAM BOOKLET _ శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్లెట్‌ విడుదల

SALAKATLA BRAHMOTSAVAMS: SEPTEMBER 15-23

NAVARATRI BRAHMOTSAVAMS: OCTOBER 12-20

Tirumala, September 09, 2026: The 2026 Brahmotsavam booklet containing details of the Salakatla and Navaratri Brahmotsavams at Tirumala was released on Wednesday during the TTD Board meeting held at Annamayya Bhavan in Tirumala.

TTD Chairman Sri B.R. Naidu, E O Sri Muddada Ravichandra and Board Members jointly released the booklet.

The Salakatla Brahmotsavams will be held from September 15 to 23, while the Navaratri Brahmotsavams will be observed from October 12 to 20.

The booklet provides devotees with details of the various vahana sevas, special rituals and important events scheduled during the Brahmotsavams.

Additional EO Sri Ch. Venkayya Chowdary, JEOs Dr. A. Sharath and Sri Prabhala Gopinath, CVSO Sri K.V. Muralikrishna, and other officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్లెట్‌ విడుదల

సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు

అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల, 2026 సెప్టెంబర్ 09: తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 2026 సంవత్సర బుక్లెట్‌ను బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్‌ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు కలిసి ఆవిష్కరించారు.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహించే వివిధ వాహన సేవలు, విశేష ఉత్సవాలు, ముఖ్య కార్యక్రమాల వివరాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ బుక్లెట్‌ రూపొందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.