TTD RELEASES Rs.3309.89CR BUDGET ESTIMATES FOR THE FINANCIAL YEAR 2020-21 _ రూ.3,309.89 కోట్లతో టిటిడి వార్షిక బ‌డ్జెట్ : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala, 29 Feb. 20: The Trust Board meeting of TTD was held at Annamaiah Bhavan in Tirumala on Saturday. Some excerpts from Board meeting.

  • To avoid frequent fire accidents in Boondi Potu, advanced equipment (Thermo fluid Kadais) at Rs.3.30crore will be set up
  • Sanction of Rs.14crore and 34crore towards the construction of Hostels for SV Technical Education for Handicapped and SV Deaf and Dumb students respectively
  • To complete balance works in the extension of Alipiri-Cherlopalle road at Rs.16crore
  • To take up construction of Sri Padmavathi Ammavari temple at Chennai at a cost of Rs.3.92crore
  • To construct Anjaneya Swamy temple, Pushkarini, Vahana Mandapam, Kalyanotsava Mandapam and other works at Sri Venkateswara Swamy temple in Jubilee Hills at Hyderabad.
  • To set up 1300 CC Cameras in Third Phase in Tirumala
  • Sanction of Rs.8.43crore towards the construction of Operation Theatres in new OP building and also to fill the vacancies through recruitment notification.
  • Nod for classification of vehicles at Alipiri Toll Gate as per National Highway Authority of India (NHAI) and fix the Toll Fees accordingly by with complete exemption of fee for two-wheelers.
  • To fill the vacancies of 313 Security Guards in TTD Vigilance and Security Department.
  • To set up a separate Cyber Crime Wing in TTD by appointing a Special Officer. Infosys to provide all technical support.
  • To construct Srivari temples at Jammu, Varanasi and Mumbai. The Bhoomi Puja soon to be performed for the temple at Mumbai.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రూ.3,309.89 కోట్లతో టిటిడి వార్షిక బ‌డ్జెట్ :టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 2020 ఫిబ్ర‌వ‌రి 29: టిటిడి వార్షిక బ‌డ్జెట్‌ను 2020-21 సంవ‌త్స‌రానికి సంబంధించి రూ.3,309.89 కోట్లతో ఆమోదించిన‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ శార్వ‌రి నామ సంవ‌త్స‌ర తెలుగు పంచాంగాన్ని ఛైర్మ‌న్ ఆవిష్క‌రించారు.

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ప్ర‌ధాన నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి.

– శ్రీ శార్వ‌రి నామ సంవ‌త్స‌ర తెలుగు పంచాంగం శ‌నివారం నుండి తిరుమ‌ల‌, తిరుప‌తిలో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంది. మార్చి మొద‌టి వారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిటిడి క‌ల్యాణ‌మండ‌పాలు, స‌మాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది.

– తిరుమ‌ల‌లోని బూందీ పోటులో అగ్నిప్ర‌మాదాల నివార‌ణ కోసం రూ.3.30 కోట్ల‌తో అధునాత‌న థ‌ర్మోఫ్లూయిడ్ క‌డాయిలు ఏర్పాటుకు ఆమోదం.

– జూపార్కు స‌మీపంలో రూ.14 కోట్ల‌తో ఎస్వీ ప్ర‌త్యేక ప్ర‌తిభావంతుల శిక్ష‌ణ సంస్థ హాస్ట‌ల్ భ‌వ‌నం, రూ.34 కోట్ల‌తో ఎస్వీ బ‌దిర పాఠ‌శాల హాస్ట‌ల్ భ‌వ‌నాల నిర్మాణానికి ఆమోదం.

– అలిపిరి – చెర్లోప‌ల్లి రోడ్డు విస్త‌ర‌ణలో మిగిలివున్న ప‌నుల‌ను రూ.16 కోట్ల‌తో పూర్తి చేసేందుకు ఆమోదం.

– బ‌ర్డ్ ఆసుప‌త్రిలోని నూత‌న ఓపి భ‌వ‌నంలో అద‌న‌పు ఆప‌రేష‌న్ థియేట‌ర్ల నిర్మాణానికి రూ.8.43 కోట్లు మంజూరు.

– బ‌ర్డ్ ఆసుప‌త్రిలో వివిధ కేట‌గిరీల్లో అవ‌స‌ర‌మైన పోస్టులు సృష్టించేందుకు ప్ర‌భుత్వానికి విన్న‌వించాల‌ని నిర్ణ‌యం.

– తిరుమ‌ల‌లో మూడో ద‌శ‌లో 1300 సిసి కెమెరాలు టెండ‌రు ద్వారా ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరు.

– చెన్నైలోని జిఎన్ చెట్టి రోడ్డులో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయ నిర్మాణానికి కృష్ణా జిల్లాకు చెందిన న‌ట‌రాజ‌న్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ సంస్థ‌కు రూ.3.92 కోట్ల‌తో టెండ‌రు ద్వారా అప్ప‌గించేందుకు ఆమోదం.

– రూ.4 కోట్ల‌తో హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, పుష్క‌రిణి, వాహ‌న మండ‌పం, క‌ల్యాణోత్స‌వ మండ‌పం త‌దిత‌ర నిర్మాణాలు చేపట్టేందుకు ఆమోదం.

– టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలో ఖాళీగా ఉన్న 300 సెక్యూరిటీ గార్డు పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ఆమోదం.

– అలిపిరి చెక్‌పాయింట్ వ‌ద్ద టోల్‌గేట్‌లో జాతీయ ర‌హ‌దారుల సంస్థ నిర్దేశించిన మేర‌కు వాహ‌నాల విభ‌జ‌న చేప‌ట్టి ఫాస్టాగ్ అమ‌లు చేయాల‌ని, టోలు రుసుం పెంచాల‌ని నిర్ణ‌యం. ద్విచ‌క్ర వాహ‌నాల‌కు టోలురుసుం మిన‌హాయింపు.

– ఇన్‌ఫోసిస్ సంస్థ స‌హ‌కారంతో టిటిడిలో సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుచేసి ప్ర‌త్యేకాధికారిని నియ‌మించాల‌ని నిర్ణ‌యం.

– జ‌మ్మూ, వార‌ణాశి, ముంబ‌యిలో త్వ‌ర‌లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణం చేప‌డ‌తాం. త్వ‌ర‌లో ముంబ‌యిలో ఆల‌య నిర్మాణానికి భూమిపూజ నిర్వ‌హిస్తాం.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఎక్స్ అఫిసియో స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి ఇత‌ర ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.