TTD REVOKES ITS DECISION ON DARSHAN DURING MAHASAMPROSHANAM FETE_ మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిర్ణయంపై పున: సమీక్ష

FEED BACK WILL BE TAKEN FROM PILGRIMS TILL 23RD JULY-EO

Tirumala, 17 July 2018: The temple management of Tirumala Tirupati Devasthanams has revoked it’s earlier decision to cancel darshan to pilgrims during Maha Samprokshanam from August 11 to 16.

EO along with TTD Trust Board Chairman Sri Putta Sudhakar Yadav speaking to media persons at Annamaiah Bhavan in Tirumala on Tuesday said that, this decison has been taken under the instructions of Honourable CM of AP Sri N Chandrababu Naidu.

Elaborating further EO said, after thoroughly reviewing the situation, Honourable CM has given us all directives to ensure that there should not be any constraint to rituals and inconvenience to pilgrims during this period. “Now the decision is open to pilgrims. We will go with majority of pilgrim opinion on the mode of darshan whether to allot tickets online or to provide darshan on first come first serve basis based on the availability of time. We will receive the feedback from pilgrims till 23rd July since the Board Meeting is on July 24. A final call on how to provide darshan will be taken in the board meeting”, said, TTD EO Sri Anil Kumar Singhal.

Adding further the EO said,”Our earlier decision to dispense with darshan to pilgrims from August 11 to 16 was also in the larger interests of pilgrims as we could be able to allot hardly 30 hours during the six day period of religious ceremony for darshan. During this time we could be able to provide darshan to less than 15thousand pilgrims a day in the available time space. Our chief aim behind the previous decision was to avoid inconvenience and hardship to Pilgrims”, both Chairman and EO reiterated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిర్ణయంపై పున: సమీక్ష

జూలై 23వ తేదీ వరకు భక్తుల నుండి అభిప్రాయసేకరణ- టిటిడి ఈవో

జూలై 17, తిరుమల 2018: ఆఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం సందర్భంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని పున: సమీక్షిస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం ఉదయం టిటిడి ఛైర్మన్‌ శ్రీపుట్టా సుధాకర్‌ యాదవ్‌తో కలిసి ఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయాలను పున: సమీక్షించాలని ఆదేశించారన్నారు. ఇందుకు అనుగుణంగా నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు భక్తుల నుండి అభిప్రాయసేకరణ జరుగుతుందన్నారు. ఈనెల 24వ తేదీన జరుగనున్న టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో మహాసంప్రోక్షణం జరుగు రోజులలో అందుబాటులో ఉన్న తక్కువ వ్యవధిలో భక్తులకు ఏవిధంగా దర్శనం కల్పించవచ్చు అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు 6 రోజులలో దాదాపు 30 గంటల సమయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మనకున్న సమయంలో రోజుకు దాదాపు 15 వేల మంది వరకు భక్తులను అనుమతించే అవకాశం ఉందన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడాలనే లక్ష్యంతోనే గతంలో నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్‌, ఈవో తెలిపారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.