TTD SCHOOL INKS PACT WITH SINGHANIA EDUCATION TRUST _ సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌తో టిటిడి పాఠశాల ఎంఓయు 

TIRUMALA, 25 FEBRUARY 2023: In a major initiative, the TTD-run Sri Venkateswara Elementary and High School at Tirumala entered MoU with the country’s most acclaimed Smt Sulochana Devi Singhania School Trust on Saturday evening.

 

The pact took place in the presence of TTD EO Sri AV Dharma Reddy at his Bunglow in Tirumala between TTD DEO Dr Bhaskar Reddy on behalf of TTD Educational Institutions and Singhania Education Trust Honorary Secretary Sri Arun Mahesh Agarwal along with Smt Revati Srinivasan, Director, Singhania Group of Schools.

 

Speaking on the occasion the EO expressed his confidence that this would definitely impact on enhancing education standards of the students making the school to the top position in India. He urged the Singhania Education Group representatives to improve the quality of education by imparting best training to the teachers in digital learning, teaching tactics, analytical skills etc. “You concentrate and take over the Academics while we provide you the entire infrastructure. We want the school to be the best role model in the entire country in Academics”, EO reiterated.

 

The Singhania Education Trust representatives assured that they will do their best in imparting qualitative education with trained faculty. “The prime motto of our Trust is to provide qualitative education to one lakh pupils and it is the life ambition of our Chairman and MD(Reymond Group) Sri Goutam Singhania. We feel privileged to sail with TTD and consider this as a divine opportunity”, they asserted.

 

Head Master of SV High School Sri Krishnamurthy, Education Department Staff AEO Sri Eswaraiah, Senior Assistant Smt Mamata were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌తో టిటిడి పాఠశాల ఎంఓయు

ఫిబ్రవరి 25, తిరుమల 2023: తిరుమలలో టిటిడి ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర ప్రాథమిక, ఉన్నత పాఠశాల శనివారం సాయంత్రం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీమతి సులోచనా దేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయు) కుదుర్చుకుంది. తిరుమలలోని బంగ్లాలో టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సమక్షంలో దేవస్థానం విద్యాసంస్థల తరఫున డిఇవో డా. భాస్కర్ రెడ్డి, సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ గౌరవ కార్యదర్శి శ్రీ అరుణ్ మహేష్ అగర్వాల్‌తో పాటు సింఘానియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీమతి రేవతి శ్రీనివాసన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యా ప్రమాణాలు పెరిగి భారతదేశంలోని ఉన్నతమైన పాఠశాలగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ లెర్నింగ్, బోధనా పద్ధతులు, విశ్లేషణా సామర్థ్యం తదితర అంశాల్లో ఉపాధ్యాయులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా విద్య నాణ్యతను మెరుగుపరచాలని సింఘానియా ఎడ్యుకేషన్ గ్రూప్ ప్రతినిధులను ఆయన కోరారు. అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, విద్యా బోధనాంశాలపై దృష్టి పెట్టాలని, తద్వారా దేశంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.

శిక్షణ పొందిన అధ్యాపకులతో గుణాత్మక విద్యను అందించేందుకు తమవంతు కృషి చేస్తామని సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. లక్ష మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే రేమాండ్ గ్రూప్ సిఎండి శ్రీ గౌతమ్ సింఘానియా జీవిత ఆశయమని, ఇందులో భాగంగా టిటిడితో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణమూర్తి, విద్యా విభాగం ఏఈవో శ్రీ ఈశ్వరయ్య, సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి మమత పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.