TTD SCHOOLS EXCEL IN TENTH _ పదో తరగతి పరీక్షల్లో టీటీడీ విద్యా సంస్థల అత్యుత్తమ ఫలితాలు
TIRUPATI, 06 MAY 2023: The students of all TTD schools excelled in their tenth exams in the academic year 2022-23.
Chi P Muni Prasanth of TTD-run Sri Kodandarama Swamy High school scored he highest 578 marks. JEO for Health and Education Smt Sada Bhargavi and DEO Sri Bhaskar Reddy appreciated the student.
In Sri Venkateswara High School the pass percentage stood at 91%. Chi. Delhi Kumar scored 558, Chi P Yugandhar Naidu stood second with 550 marks and Kum.Ramya scored 549 marks. A total of 16 pupils from the school scored 500 plus marks.
In Sri Kapileswara Swamy High School, the pass percentage was registered as 83%. Chi.M Lohit Sai scored highest marks of 524 while three other students scored 500 plus marks.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
పదో తరగతి పరీక్షల్లో టీటీడీ విద్యా సంస్థల అత్యుత్తమ ఫలితాలు
– విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులను అభినందించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి 6 మే 2023: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎనిమిది ఉన్నత పాఠశాలలు శనివారం వెలువడిన పదవతరగతి పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ స్థానం సాధించాయి.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఇందుకోసం కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జేఈవో శ్రీమతి సదా భార్గవి, విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం.భాస్కర్ రెడ్డి అభినందించారు.
ఎనిమిది ఉన్నత పాఠశాలల నుండి 567 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు. ఇందులో 490 మంది పాసయ్యారు. మొత్తంగా 86 శాతం ఫలితాలు సాధించడం జరిగింది.
ఇందులో శ్రీ కోదండరామ స్వామి ఉన్నత పాఠశాలలకు చెందిన పి.ముని ప్రశాంత్ 578 మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు.
ఎస్జీఎస్ హైస్కూల్ కు చెందిన పి.వంశిక 564.మార్కులు, తిరుపతి ఎస్వీ హైస్కూలు కు చెందిన డి.దిలీప్ కుమార్ 558 మార్కులు సాధించి ఆ పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారు.
తాటితోపు ఉన్నత పాఠశాల విద్యార్థి ఎ. సాయి లోహిత్ 524 మార్కులు సాధించి పాఠశాల టాపర్ స్థానంలో నిలిచాడు.
ఓరియంటల్ హైస్కూలు కు చెందిన ఎస్.అల్తాఫ్ 524 మార్కులు, తిరుమల ఎస్వీ హైస్కూలు కు చెందిన ఎన్ ఎస్ హాసిని 538 మార్కులతో ఆయా పాఠశాలల టాపర్ లు గా నిలిచారు.
శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్.శ్వేతారెడ్డి 541 మార్కులతో పాఠశాల టాపర్ గా నిలిచారు.
ఎస్వీ డెఫ్ ప్రత్యేక హైస్కూలు కు చెందిన పి.స్పందన 400 మార్కులకు గాను 339 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచింది. ఈ పాఠశాల 100 శాతం ఫలితాలు సాధించింది.
జేఈవో శ్రీమతి సదా భార్గవి నేతృత్వంలో డిఈవో డాక్టర్ ఎం.భాస్కర్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. చదువులో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి చదివించడంతో ఈ ఫలితాలు సాధ్యం అయ్యాయి.ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి కూడా ఈ ఫలితాల సాధనకు దోహదం చేసింది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది