TTD SET FOR KARTHIKA VANABHOJANAM IN TIRUMALA ON NOV 17 _ నవంబరు 17న తిరుమలలో కార్తీక వన భోజనోత్సవాల‌కు ఏర్పాట్లు పూర్తి

Tirumala, 16 Nov. 19: TTD is all set to observe Karthika Vanabhojana Mahotsavam on November 17 at Paruveta Mandapam.

On this special occasion, TTD will organize a mass community dining programme in the lush green forests of Seshachalam, covered with Amla trees at Paruveta Mandapam. 

Before this mass dining programme, the special Snapana Tirumanjanam will be performed to the processional deities of Lord Sri Malayappa Swamy and His two consorts Sridevi and Bhudevi. 

 

There will also be a rendition of Annamacharya Sankeertans and Harikatha Parayanam on this celestial occasion.

Devotees and locals take part in huge numbers in this community dining programme which is unique in the month of Karthika.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

నవంబరు 17న తిరుమలలో కార్తీక వన భోజనోత్సవాల‌కు ఏర్పాట్లు పూర్తి

తిరుమల, 2019 నవంబరు 16: పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 17వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీకవనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో ఘనంగా నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు అవ‌స‌ర‌మైన చ‌లువ పందిళ్లు, విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేసింది. అదేవిధంగా అధిక‌ సంఖ్య‌లో విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం క్యూలైన్లు, అన్న‌ప్ర‌సాదాలు పంపీణి చేసేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు.
         
ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్ప స్వామివారిని బంగారుతిరుచ్చిపై కూర్చుండబెట్టి వాహనమండపానికి ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఉదయం 8.00 గం||లకు సమర్పణ అనంతరం మలయప్పస్వామి వారిని ఒక చిన్న గజవాహనంపై వాహనమండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అదే విధంగా అందంగా అలంకరించి మరో పల్లకిపై ఉభయనాంచారులను రంగనాయక మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. కార్తీక వనభోజన మహోత్సవం నేపథ్యంలో ఉద‌యం 11.00 నుండి 12.00 గంట‌ల వ‌ర‌కు శ్రీ భూ స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్నపన తిరుమంజనం వైభ‌వంగా నిర్వహిస్తారు.

కాగా వనభోజన మహోత్సవాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి పెద్దకుమారుడైన శ్రీపెదతిరుమలాచార్యులవారు 16వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే ఏకారణాల వల్లనో ఈ కార్తీక వనభోజనోత్సవం ఆగిపోయింది.
 
 అయితే సుమారు 500 ఏళ్ళుగా ఆగిన ఈ ఉత్సవాన్ని టిటిడి 2010వ సంవత్సరం నుండి తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు కార్తీక వనభోజనోత్సవం ఈ ఏడాది నవంబరు 17వ తేదిన పార్వేట మండపంలో మధ్యాహ్నం 1.00 నుండి 2.00 గంటల నడుమ ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భగవంతుని సమక్షంలో భక్తులు కూడ సహపంక్తి భోజనం చేయడం విశేషం. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు తరపున వివిధ భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
       
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు భక్తులు పాల్గొంటారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.