TTD SHIFTS THE ROOM ALLOTMENT SYSTEM TO TIRUPATI _ తిరుమలలో గదుల కేటాయింపు వ్యవస్థ తిరుపతికి తరలింపు
EXPERIMENTAL CHANGE IN BREAK DARSHAN TIMINGS TO BENEFIT COMMON DEVOTEES
TTD EO INFORMS AT DIAL YOUR EO PROGRAM
Tirumala,9, October 2022: TTD EO Sri AV Dharma Reddy declared two major initiatives for benefit of common devotees on Sunday.
They included shifting the room allotment system to Tirupati and also experimental change in VIP break Darshan timings to facilitate the common devotees.
Addressing the monthly Dial-your EO program from Annamaiah Bhavan the TTD complimented the officials of all TTD departments, employees, district administration, police and Srivari Sevakulu for their coordinated efforts and devotees cooperation He also expressed his appreciation to media persons who along with SVBC who conveyed the glory of Sri Venkateshwara during Brahmotsavam to devotees through their channels and publications.
He highlighted the TTD activities during Brahmotsavam beginning with the Honourable CM of AP visit to Tirumala: inaugurating the electric buses at Alipiri, presenting pattu vastram o Sri Venkateshwara and participating inPedda Sesha vahana on September 27 and inauguration of new building of Parakamani Bhavan and VPR guest house on September.28.
Among others, he said nearly 3 lakh persons were given Srivari Garuda Seva Darshan on October 1 and cultural shows put up by 1906 Artists of 91 teams from seven states enthralled devotees during Brahmotsavam. Similarly, 6997 poor devotees from 26 districts were brought to Tirumala in 147 buses and provided free Srivari Brahmotsavam Mula murti Darshan.
TTD EO said the TTD has on an experimental basis shifted room allotment system to Tirupati to facilitate devotees so Se not getting rooms in Tirumala could be accommodated in Tirupati.
Similarly for benefit of common devotees night-long waiting in compartments to get early morning Srivari Darshan, TTD will shift the VIP break Darshan hours to 10.00 am onwards.
OTHER HIGHLIGHTS OF HIS SPEECH WERE
Honourable AP CM releases 2023 calendars and diaries. They comprised of 13 lakh copies of 12-page calendars, 50,000 copies of 8-page calendars,8 lakh big diaries,1.50 lakh small calendars, tabletop calendars 2.5 lakhs, 3.5 lakh TTD big calendars 10,000 Sri Padmavati calendars,4 lakhs of Sri Padmavati calendars, Telugu Panchangam 2.5 lakh copies.
All of the. Were made available at TTD book stalls in Tirumala and Tirupati and other TTD information centers soon.
The third Peritasi Saturday had brought a huge rush to Tirumala and waiting time shot up to 48 hours on Saturday. Devotees were requested to cooperate.
The QR code system introduced for benefit of Srivari Sevakulu to locate their point of service was successful and soon will be replicated for benefit of devotees also.
Sri Venkateshwara vaibhavotsavam: TTD is conducting a five-day fete of Sri Venkateshwara vaibhavotsavam at Hyderabad from October 11- 15 at NTR stadium to showcase the Nitya Kainkaryas ( Including vahana sevas,utsava, etc) of Srivari temple to devotees of other regions. The program includes Vasantothsavam on October 11, Sahasra Kalashabhisekam on October 12, Tiruppavadai on October 13, Abhishekam, Nija pada Darshan on October 14 and Srinivasa kalyanam on October 15.
Similar Vaibhavotsavam events will be held at Ongole in December and in Delhi in February.
Karthika deeppotsavam: TTD is organising Karthika deeppotsavam fete at Visakhapatnam, and Yaganti in the Kurnool district during Karthika Masam.
Temple constructions: TTD plans to conduct the Maha Samprokshana fete at Sri Padmavati temple, Chennai and Srivari temple, Jammu Uttarayana ( after January)
Gujarat government has granted five acres of land for the Srivari temple construction at Ahmedabad for which Bhumi puja will be performed soon.
Srinivasa Kalyanam: TTD plans to conduct the Srinivasa Kalyanam fete in remote agency regions of Anakapalli, Arasu and Rampachodavaram region in October.
Details of the Srivari temple recorded in September 2022 are as below,
Darshan: 21.12 lakhs
Hundi: ₹ 122.19 crore
Laddus: 98.74 lakhs
Anna Prasadam: 44.71
Kalyana katta : 9.02 lakhs
TTD JEOs Smt. Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and others were present.
తిరుమలలో గదుల కేటాయింపు వ్యవస్థ తిరుపతికి తరలింపు
– సామాన్య భక్తుల సౌకర్యార్థం ప్రయోగాత్మంగా బ్రేక్ దర్శన సమయం మార్పు
– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల,2022 అక్టోబరు 09: తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వరలో తిరుపతిలో చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు .
– టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమిష్టి కృషి, భక్తుల సహకారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయి. టీటీడీ అధికారులు, సిబ్బంది, ఎస్వీబీసీతోపాటు తమ ఛానళ్లలో శ్రీవారి వైభవాన్ని భక్తులకు తెలియజేసిన ప్రచార, ప్రసార సాధనాల ప్రతినిధులకు మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సెప్టెంబరు 27వ తేదీ తిరుపతి నుండి తిరుమలకు విద్యుత్ బస్సులు ప్రారంభించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు.
– సెప్టెంబరు 28వ తేదీ నూతనంగా నిర్మించిన పరకామణి భవనం, విపిఆర్ గెస్ట్ హౌస్ ప్రారంభించారు.
– గరుడ సేవ నాడు దాదాపు మూడు లక్షల మంది భక్తులకు పైగా వాహనసేవ దర్శనభాగ్యం కల్పించాం.
– హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏడు రాష్ట్రాల నుండి వచ్చిన 91 కళాబృందాల్లో 1906 మంది కళాకారులు వాహన సేవలతో పాటు తిరుమల, తిరుపతిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి. భక్తులు ఎంతో సంతోషించారు.
– రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 147 బస్సుల ద్వారా 6,997 మంది వెనుకబడిన పేద వర్గాలవారిని ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహనసేవల దర్శనం చేయించాం.
– తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయం. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. త్వరలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలుపెడతాం.
– శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న విఐపి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తాం.
– శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.
వ 12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు 50 వేలు, పెద్దడైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 2.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను ముద్రించాం.
– క్యాలెండర్లు, డైరీలు తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని టిటిడి సమాచార కేంద్రాల్లో వచ్చే వారం నుండి అందుబాటులో ఉంచుతాం.
– పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నాం.
– తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించే శ్రీవారి సేవకులు ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన క్యూఆర్ కోడ్ విధానం విజయవంతమైంది. భక్తుల కోసం త్వరలో తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం.
– తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నాం.
– ఇందులో భాగంగా అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
– అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగనున్నాయి.
– డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీ లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తాం.
– పవిత్రమైన కార్తీక మాసంలో గత ఏడాది తరహాలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తాం.
– ఉత్తరాయణంలో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ చేపడతాం.
– అహ్మదాబాద్ నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గుజరాత్ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చింది. త్వరలో భూమిపూజ చేస్తాం.
– అక్టోబరు నెలలో ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తాం.
సెప్టెంబరు నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 21.12 లక్షలు.
హుండీ :
– హుండీ కానుకలు – రూ.122.19 కోట్లు.
లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 98.74 లక్షలు.
అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 44.71 లక్షలు.
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 9.02 లక్షలు.
ఈ కార్యక్రమంలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది