TTD ANNUAL SPORTS FROM FRB 1 TO 17_ ఫిబ్రవరి 1 నుంచి 17వ తేదీ వరకు టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati, 9 November 2017: The annual sports event for TTD in service and retired employees will be from February 1 to 17 and the registration for the same will be from January 18 to 27, said Tirupati JEO Sri P Bhaskar.
A review meeting on the same was conducted in TTD Adminsitrative building meeting hall on Thursday. speaking on this occasion the JEO said there will separate competitions for men, women and specially able category employees.
Additional CVSO Sri Shiva Kumar Reedy, Welfare Depart Dy EO Smt Snehalatha, CAO Sri Raviprasadudu were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 1 నుంచి 17వ తేదీ వరకు టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
నవంబరు 09, తిరుపతి, 2017: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు 2018, ఫిబ్రవరి 1 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో గురువారం ఉద్యోగుల క్రీడల నిర్వహణపై జెఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనేందుకు జనవరి 18 నుంచి 27వ తేదీ వరకు నమోదు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1న క్రీడల ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. మహిళలకు, ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తామన్నారు. బాల్‌బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, త్రోబాల్, కబడ్డీ, పరుగు, నడక, షాట్‌పుట్, బాల్‌త్రో తదితర క్రీడాంశాలు ఉంటాయని తెలిపారు. ఉద్యోగులు ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, సిఏవో శ్రీ రవిప్రసాదు, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్, సిఎంఓ డా|| నాగేశ్వరరావు, ఈఈ శ్రీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.