TTD STAFFS CHILD MAKES IT TO NASA-CHAIRMAN, EO COMPLIMENTS THE BOY_ నాసా పోటీల్లో ప్రతిభ కనబరిచిన టిటిడి ఉద్యోగుల కుమారునికి టిటిడి ఛైర్మన్‌, ఈవో అభినందనలు

Tirumala, 26 June 2018: In what is called a moment of pride to the TTD employee couple Smt Veenadhari and Sri Venkatesh, their son Chi VGL Amarthya made it to NASA in US for annual space research contest.

Studying in Class VI, from Sri Chaitanya School, Tirupati, the boy got selected to this prestigious International space conference which took place from May 24 to 27.

TTD Trust Board Chief Sri P Sudhakar Yadav and TTD EO Sri Anil Kumar Singhal complimented the boy at Annamaiah Bhavan in Tirumala on Tuesday evening for having won second prize in the conference and also the parents for giving encouragement to the boy whose ambition is to take up space science as his future career.

TTD PRO Dr T Ravi, School Principal Sri Rajasekhar were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నాసా పోటీల్లో ప్రతిభ కనబరిచిన టిటిడి ఉద్యోగుల కుమారునికి టిటిడి ఛైర్మన్‌, ఈవో అభినందనలు

జూన్‌ 26, తిరుమల 2018: ఇటీవల జరిగిన నాసా ఏమ్స్‌ రీసెర్చి డిజైన్‌ కాంటెస్ట్‌-2018లో ప్రతిభ కనబరిచిన టిటిడి ఉద్యోగుల కుమారుడు విజిఎల్‌.అమర్థ్య(11)ను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అభినందించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి ఉద్యోగులైన దంపతులు శ్రీ వేంకటేష్‌, శ్రీమతి వీణాదరి మంగళవారం సాయంత్రం టిటిడి ఛైర్మన్‌, ఈవోను కలిశారు.

తిరుపతిలోని శ్రీ చైతన్య పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అమర్థ్య మే 24 నుండి 27వ తేదీ వరకు అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ప్రపంచస్థాయిలో జరిగిన ఏవలాన్‌ ప్రాజెక్టులో రెండో స్థానం సాధించినందుకు గాను నాసా, నేషనల్‌ స్పేస్‌ సొసైటి సంయుక్తంగా బహుమతి ప్రదానం చేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.