TTD STUDENTS SHOULD BE ENCOURAGED TO JOIN NCC, NSS, SCOUTS- CVSO _ విద్యార్థులను ఎన్‌సిసి, ఎన్ఎస్ ఎస్, స్కౌట్స్‌ అండ్ గైడ్స్ వైపు ప్రోత్స‌హించాలి – సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి

Tirupati, 08 March 2022:  TTD CVSO Sri Gopinath Jatti said that all students of TTD educational institutions should be encouraged to join NCC, NSS, Scouts & Guides to motivate nationality and patriotism among them.

Addressing a review meeting with the Principals and Wardens of TTD Educational institutions at the conference hall of the TTD administrative buildings on Tuesday evening, the CVSO evaluated the CC cameras, security arrangements, Biometric and security of girl students at the TTD schools, colleges and hostels.

He said students of TTD educational institutions should be motivated to become partners in nation-building activities and heralded the TTD institutions should take on Delhi colleges as role models.

He said the students should be led through the right path with motivation classes and discourses by Swamijis and experts in various sectors.

Students be motivated to participate in sports and other cultural activities to whip up their intellectual growth and the CVSO said Tirupati was grooming as an educational hub with vast infrastructure which should be exploited to build a greater future for the younger generation.

TTD Education Officer Sri Govindarajan, VGO Sri Manohar, AVSO Smt Kalavati were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విద్యార్థులను ఎన్‌సిసి, ఎన్ఎస్ ఎస్, స్కౌట్స్‌ అండ్ గైడ్స్ వైపు ప్రోత్స‌హించాలి –
సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి

తిరుపతి, 2022 మార్చి 08: టిటిడి కళాశాలలోని విద్యార్థులను ఎన్‌సిసి, ఎన్ఎస్ ఎస్, స్కౌట్స్‌ అండ్ గైడ్స్ విభాగాల్లో చేరేలా ప్రోత్సహించాలని, తద్వారా వారికి దేశ భక్తి అలవడుతుందని టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి చెప్పారు.

మంగళవారం సాయంత్రం టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆయన టిటిడి కళాశాల ప్రిన్సిపాళ్లు, వార్డ‌న్‌ల‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన కళాశాల‌లు, హాస్టల్లో సిసి టీవీలు, సెక్యూరిటీ ఏర్పాట్లు, బయోమెట్రిక్, హాస్టల్ విద్యార్థినుల భద్రతకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. టిటిడి విద్యాసంస్థల్లో సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని, టిటిడి విద్యాసంస్థ‌ల‌కు ఢిల్లీ కాలేజ్ రోల్ మోడల్‌గా ఉందన్నారు. మిగిలిన కళాశాల‌లు ఈ స్థాయికి చేరుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులను సన్మార్గంలో తీసుకుని వెళ్లడానికి మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయించాలని సూచించారు. గొప్ప మేధావులు, ఆయా రంగాల నిపుణులు, స్వామీజీల ప్రవచనాలను విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా వారిలో గొప్ప ప్రేర‌ణ‌ కలుగుతుందన్నారు. వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు పిల్లలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని, అదేవిధంగా వ్యవస్థ లో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడేలా ఆటలు, కళ‌ల పట్ల వారిని ప్రోత్సహించాలన్నారు. తద్వారా వారు ఆయా రంగాల్లో చక్కగా రాణిస్తార‌ని చెప్పారు. తిరుపతి విద్యా కేంద్రంగా విరాజిల్లుతోంద‌ని, ఇక్క‌డి వ‌న‌రులు చక్కగా ఉపయోగించుకుని విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

టీటీడీ డిఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, విజివో శ్రీ మనోహర్, ఎవిఎస్వో శ్రీ‌మ‌తి క‌ళావ‌తి సమావేశంలో పాల్గొన్నారు.

తి.తి.దే.ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.