TTD TO ARRANGE 22 GERMAN SHEDS FOR COVID VICTIMS IN AP _ కోవిడ్ బాధితుల కోసం రాష్ట్రంలో 22 జర్మన్ షెడ్ల నిర్మాణం

Tirumala, 13 May 2021: TTD plans to build 22 sheds with German technology in Andhra Pradesh at a cost of Rs.3.52 crore for providing beds to Covid victims after a successful experiment in the pilgrim city at Sri Padmavati Covid hospital,

Following requests for similar oxygen bed facilities on the Tirupati model, the TTD EO Dr KS Jawahar Reddy has on Thursday sanctioned the said amount from the SV Sarva Shreya Nidhi to build such Tents with German technology in different places in AP.   Each shed will have 30 beds facility.

As per schedule: 4 at Visakhapatnam, 3 each in Anantapur, Guntur, Kakinada and Krishna, 2 each in Prakasam, Kurnool and 2 other locations such sheds will be built. District collectors will be provided funds as per the cost estimates made by TTD for each shed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కోవిడ్ బాధితుల కోసం రాష్ట్రంలో 22 జర్మన్ షెడ్ల నిర్మాణం

తిరుమల 13 మే 2021: కోవిడ్ 19 బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్ షెడ్లు నిర్మించడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ 3. 52 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన ఈఓ జవహర్ రెడ్డి.

కోవిడ్ 19 బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో బెడ్ల అందుబాటు ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. ఈ ఇబ్బందులు కొంత మేరకైనా తగ్గించడానికి ఇటీవల తిరుపతి శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రి వద్ద జర్మన్ షెడ్ నిర్మించి అందులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ షెడ్లు నిర్మించాలని టీటీడీకి విన్నపాలు వచ్చాయి. ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశం మేరకు శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయో నిధి నుంచి రూ.3. 52 కోట్లు మంజూరు చేశారు.

ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో 4, ప్రకాశం 2, అనంతపురం 3, కృష్ణ 3, కర్నూలు 2, గుంటూరు 3, కాకినాడ 3 తో పాటు ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లునిర్మించనున్నారు. టీటీడీ ఆమోదించిన అంచనా ఖర్చు మేరకు షెడ్లు నిర్మించుకోవడానికి ఆయా జిల్లా కలెక్టర్లకు నిధులు అందించనుంది. ఒక షెడ్లో దాదాపు 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.