TTD TO CONDUCT KANAKAMBARA SAHITHA KOTI MALLEPUSHPA MAHA YAGAM IN TIRUCHANOOR _ ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ విధానంలో క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగం

Tirupati, 14 July 2021: To overcome the financial crisis which the entire world has been facing from the past one and a half years due to Covid Pandemic, TTD has mulled a unique yagam, Kanakambara Sahita Koti Mallepushpa Maha Yagam from July 16 to 24, for nine days in Ekantam at Sri Padmavathi Ammavari Temple in Tiruchanoor.

The Ankurarpanam for this religious fete will be performed on July 15 between 6pm and 8pm in the temple.

For the sake of devotees, TTD has introduced virtual participation in online and the cost of the Seva ticket is fixed cost at Rs.1, 001/- on which two persons will be allowed. The online tickets for this Yagam will be released on July 15 in TTD website.

The Gruhasthas who books the ticket in online will be presented with one upper cloth, one blouse the piece, one Akshinthalu packet and one cloth paper bag free of cost which will be given to them at the time of their Darshan of Ammavaru at Tiruchanoor within 90 days from the date of booking of this Virtual seva. Devotees will be provided Ammavari Darshan through Special Entry queue line (Rs.100/-).

Every day there will be Archana and Laghu Purnahuti in Sri Krishna Mukha Mandapam in the morning and evening respectively during these nine days. On July 24, between10.30am and 11am, Prayaschitta Homam will be performed followed by Maha Purnahuti.

Every day this programme will be telecasted live on SVBC between 10:30am and 11:30am for the sake of global devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ విధానంలో క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగం

తిరుపతి, 2021 జులై 14: కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌పంచ మాన‌వాళికి త‌లెత్తిన ఆర్థిక ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని శ్రీ మ‌హాల‌క్ష్మి అవ‌తార‌మైన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ జులై 16 నుండి 24వ తేదీ వ‌రకు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ విధానంలో క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగాన్ని టిటిడి త‌ల‌పెట్టింది. ఇందుకోసం జులై 15న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌రకు విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, అనుజ్ఞ‌, అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఈ 9 రోజుల పాటు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో అర్చ‌న‌లు, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. చివ‌రిరోజు జులై 24న ఉద‌యం 10.30 నుండి 11 గంటల వ‌ర‌కు మ‌హాప్రాయ‌శ్చిత్త హోమం, ఉద‌యం 11 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ఈ మ‌హాయాగాన్ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. భ‌క్తులు త‌మ ఇళ్ల నుండి టీవీల ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ యాగంలో పాల్గొన‌వ‌చ్చు. గృహ‌స్తుల(ఇద్ద‌రు) కోసం టికెట్ ధ‌ర రూ.1001/- గా నిర్ణ‌యించారు. వ‌ర్చువ‌ల్ విధానంలో మ‌హాయాగంలో పాల్గొనే గృహ‌స్తులు 90 రోజుల్లోపు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్ ద్వారా ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం గృహ‌స్తుల‌కు ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అమ్మ‌వారి అక్షింత‌లు అంద‌జేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.