TTD TO DEVELOP LAND SCAPE AT RS.25cr-TTD EO_ ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 6 October 2017: Following the instructions of the Honourable CM of AP Sri N Chandrababu Naidu to develop greenery in Tirumala and Tirupati, the TTD will develop the land scape in all the vacant places at Rs.20-25crores, said TTD EO Sri Anil Kumar Singhal.

After “Dial your EO” Program, speaking to media persons, the EO said, the land scape experts team will visit the twin pilgrim centres by month end. “We have already had negotiations with AP greening and beautification Corporation on the development of land scape in Tirumala. In Tirupati also we will develop gardens on either sides of road dividers”, he added.

Elaborating further the EO said, the plans for the ensuing Vaikuntha Ekadasi fete sch Dukes in the month of December, has already commenced. In next 15 days our Tirumala JEO, CVSO, SE II and Tirupati Urban SP will inspect and chalk out plans for the fete in Tirumala”, he maintained.

Later the EO said the present water levels in all the dams in Tirumala will suffice the drinking water needs for next 209 days. “We are also contemplating the ways to conserve waters of Kapilateertham, Malavadi Gundem and Manchineela Gunta. The consultant is likely to visit soon”, he said.

Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, All Projects Special Officer Sri N Muktheswara Rao, CE Chandra Sekhar Reddy, CEO SVBC Sri Narasimha Rao and other officers were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

అక్టోబరు 06, తిరుమల 2017: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు.

– సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలను వైభవంగా నిర్వహించాం.

– బ్రహ్మూెత్సవాల 9 రోజుల్లో మొత్తం 7.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

– విచ్చేసిన భక్తులందరికీ సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించాం.

– గ్యాలరీల్లోని భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించి ప్రశాంతంగా వాహనసేవల వైభవాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేపట్టాం.

– అక్టోబరు 17, 24వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు ఉదయం 10 గంటలకు వెయ్యి మందికి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల మందికి, మధ్యాహ్నం 3 గంటలకు మరో వెయ్యి మందికి కలుపుకుని 4 వేల మందికి దర్శన టోకెన్లు జారీ చేస్తాం.

– అక్టోబరు 18, 25వ తేదీల్లో 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 2 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తాం.

– 2018వ సంవత్సరానికి గాను టిటిడి 20 లక్షల 12 పేజీల క్యాలెండర్లు, 12 లక్షల డైరీలు (పెద్దవి 9 లక్షలు, చిన్నవి 3 లక్షలు), శ్రీవారి పెద్దక్యాలెండరు, శ్రీపద్మావతి మరియు శ్రీవారి క్యాలెండరు, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ కలిపి మొత్తం 17 లక్షలు ముద్రించడం జరిగింది.

– ఇవి తిరుమల, తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉన్నాయి.

– ఈ నెల చివరి వారం నుండి ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని టిటిడి సమాచార కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొస్తాం.

– భక్తులు సులభంగా వినియోగించేలా టిటిడి వెబ్‌సైట్‌ తెలుగు వర్షన్‌ను తీర్చిదిద్దాం.

– త్వరలో దశలవారీగా కన్నడ, తమిళం, హిందీ భాషల్లో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

– గోవింద మొబైల్‌ యాప్‌లో ఇదివరకే టిటిడి ఆర్జిత సేవాటికెట్లు, వసతి బుకింగ్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఈ యాప్‌లో టిటిడి సమాచారాన్ని త్వరలో పొందుపరుస్తాం.

– గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుమల, తిరుపతిలో పచ్చదనం పెంచి సుందరీకరణ పనులు చేపట్టడంపై ప్రత్యేకదృష్టి పెట్టాం. నవంబరులో పనులు ప్రారంభిస్తాం.

– రానున్న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూెత్సవాల్లో ప్రదర్శనలిచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుంచి మెరుగైన కళాబృందాలను ఆహ్వానిస్తాం.

– వైకుంఠ ఏకాదశికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశముండడంతో ముందస్తు ఏర్పాట్లుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.