TTD TO FACILITATE RUSSIAN GIRL SRIVARI DARSHAN- TTD CHAIRMAN _ రష్యన్ యువతిని అన్నివిధాలా ఆదుకుంటాం : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirumala, 29 Jul. 20: TTD Chairman Sri YV Subba Reddy on Wednesday assured all help to the Russian devotee who was stranded at Tirupati during her India tour due to Corona lockdown.

Responding to media reports on the 32-year-old Russian devotee Esther after being stranded in the temple town for 4 months due to Corona lockdown, the TTD chairman assured she will be offered accommodation, food etc. If she expresses besides Srivari darshan as well.

The Chairman sent his emissary to the Russian lady and after learning of her travails offered to organise her return journey in consultation with the Russian Embassy. 

He also assured to unite her with her mother Olivia who is stranded at Vrindavan in Uttar Pradesh. Both mother and daughter had come to Tirupati in February as a part of their pan India tour to visit all ISKON temples. Easter tried to have Srivari darshan but was denied in view of Covid-19 restrictions.

The TTD Chairman has made arrangements for Srivari darshan on Thursday to Esther. He has assured Esther Srivari darshan again after the arrival of her mother Olivia from Vrindavan.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రష్యన్ యువతిని అన్నివిధాలా ఆదుకుంటాం : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
 
తిరుపతి, 29 జూలై, 2020: రష్యా నుంచి భారతదేశ పర్యటనకు వచ్చి లాక్డౌన్ కారణంగా తిరుపతిలో ఉండాల్సి వచ్చిన రష్యన్ యువతి ఎస్తర్ ను అన్ని విధాలా ఆదుకుంటామని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. మీడియా ద్వారా ఎస్తర్ ఇబ్బందులను తెలుసుకున్న శ్రీ సుబ్బారెడ్డి బుధవారం తన ప్రతినిధిని ఆమె వద్దకు పంపి మాట్లాడించారు. ఆమె తల్లిని ఉత్తరప్రదేశ్ లోని బృందావనం నుంచి తిరుపతికి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన ధైర్యం చెప్పారు. రష్యన్ ఎంబసీతో సంప్రదించి ఇద్దరినీ వారి దేశానికి పంపేందుకు సహాయం చేస్తామని ఛైర్మన్ భరోసా ఇచ్చారు. తిరుపతిలో ఆమె వసతి, ఆహారం ఇతర అవసరాలు కోరితే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎస్తర్ అభ్యర్థన మేరకు గురువారం ఆమెకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. తన తల్లి తిరుపతికి వచ్చాక ఇద్దరికీ మరోసారి స్వామి వారి దర్శనం కల్పించాలని ఎస్తర్ కోరడంతో, తప్పకుండా ఏర్పాటు చేస్తామని చైర్మన్ అన్నారు.                          
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.