TTD TO MODERNISE SRI GT CHOULTARIES- TTD CHAIRMAN _ శ్రీ గోవిందరాజస్వామి సత్రాలను ఆధునీకరిస్తాం – టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి

Tirupati, 01 September 2022: TTD Chairman Sri YV Subba Reddy said on Thursday that TTD has decided to modernise the Sri Govindaraja Swamy choultries near Tirupati railway station and Bus station to provide more affordable and better accommodation to devotees.

 

After an inspection of the free and 50 tariff rooms at second and third choultries along with TTD board member Sri P Ashok Kumar, the TTD Chairman directed officials to provide cots, beds etc. Free in rooms.

 

Among others, he instructed officials to repairs of the leakage in rooms and corridors and cleans up the open areas by removing garbage and also provides fans and other facilities to devotees for group cooking etc.

 

NO TEMPLE IN INDIA HAS SUCH FACILITIES- DEVOTEES FROM MP

 

During his visit, TTD Chairman interacted with devotees from Jakwa town of Madhya Pradesh and enquired about their experience on Srivari Darshan, food and other amenities being provided by TTD.

 

The North Indian devotees said they were on a 22-day South Indian pilgrimage and have visited temples in Tamilnadu and Karnataka.

 

Lauding the arrangements for devotees at Tirumala and Tirupati the pilgrims expressed their immense happiness and said, such facilities are not available at any temple across the country.

 

They were highly appreciative of the free accommodation in Sri Govindaraja Swamy temple choultries, the hygiene and cleanliness at Tirumala, in parks and surroundings.

 

The North Indian devotees also said they were lucky to have Srivari Darshan under the Sarva Darshan category within four hours. ”I lost mobile but officials traced it within one hour”, another pilgrim told the TTD Chairman.

 

A devotee Sri Chakram from Gollaprolu of East Godavari said the 50 room at Sri Govindaraja Swamy choultries was nice and they had Srivari Darshan in three hours besides good Anna Prasadam at Tirumala.

 

BETTER AMENITIES IN FREE ROOMS OF GT CHOULTARIES- TTD CHAIRMAN

 

TTD Chairman said the Sri GT Choultries were over six decades old and due to Corona Pandemic they were not allocated in the last 2 years. 

 

TTD JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SE Sri Venkateshwarlu, DyEO Smt Bharati and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామి సత్రాలను ఆధునీకరిస్తాం – టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి

తిరుపతి 1 సెప్టెంబరు 20 22: తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ కు దగ్గరలోని
శ్రీ గోవిందరాజ స్వామి సత్రాలను ఆధునీకరించి సామాన్య భక్తులకు మరింత మెరుగైన వసతులు సమకూరుస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి చెప్పారు.

టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ తో కలిసి గురువారం సాయంత్రం ఆయన రెండవ, మూడవ సత్రాలను పరిశీలించారు.

భక్తులకు ఉచితంగా కేటాయిస్తున్నగదుల్లో మంచాలు, పరుపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉచిత , రూ 50 అద్దె గదుల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులను ఆయన పరిశీలించారు. గదుల తో పాటు వీటిలో కూడా లీకేజీలు అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గదులతో పాటు ఖాళీ ప్రదేశాలను కూడా శుభ్రంగా ఉంచాలన్నారు. సామూహిక వంట శాలలో ఫ్యాన్లు ఏర్పాటు చేసి యాత్రీకులు ఉపయోగించుకునే ఏర్పాటు చేయాలని శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు.

దేశంలో ఏ ఆలయంలోనూ ఇలాంటి వసతులు లేవు : మధ్యప్రదేశ్ భక్తులు

యాత్రీకుల వసతి గదుల పరిశీలనలో భాగంగా ఉచిత గదుల ప్రాంగణంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రం జాక్వా పట్టణానికి చెందిన భక్తులతో చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడారు. తిరుపతి, తిరుమలలో దర్శనం, భోజనం, ఇతర సదుపాయాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. తాము 22 రోజుల దక్షిణ భారత దేశ యాత్రకు వచ్చామని భక్తులు తెలిపారు. కర్ణాటక, తమిళనాడు లోని అనేక ఆలయాలు సందర్శించామన్నారు. తిరుపతి, తిరుమలలో టీటీడీ భక్తులకు కల్పిస్తున్న వసతులు దేశంలో ఏ ఆలయంలో కూడా తాము చూడలేదని వారు సంతోషం వ్యక్తం చేశారు. గోవిందరాజస్వామి సత్రాల్లో ఉచిత వసతి గదులు చాలా బాగున్నాయని, ప్రత్యేకించి తిరుమలలో పరిశుభ్రత, పార్కులు, పరిసరాలు చాలా గొప్పగా ఉన్నాయని వారు చెప్పారు. నాలుగు గంటల్లోనే తమకు స్వామివారి ఉచిత దర్శనం అయ్యిందన్నారు. తాము మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే, అధికారులకు ఫిర్యాదు చేసిన గంటల్లోనే తిరిగి అప్పగించారని ఒక భక్తుడు ఛైర్మన్ కు తెలిపారు.

అన్ని వసతులు బాగున్నాయి : గొల్లప్రోలు భక్తుడు చక్రం

తిరుపతిలోని గోవిందరాజ స్వామి సత్రాల్లో తాము బుధవారం రూ 50 అద్దె చెల్లించి గది తీసుకున్నామని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు కు చెందిన చక్రం అనే భక్తుడు చైర్మన్ కు తెలిపారు. వసతులు బాగున్నాయని, తిరుమల లో స్వామివారి దర్శనం మూడు గంటల్లోనే అయ్యిందని చెప్పారు.కొండ మీద అన్నదానం చాలా బాగుందన్నారు.

ఉచిత గదుల్లోనూ వసతులు : చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో భక్తులకు ఉచితంగా కేటాయిస్తున్న గదుల్లో కూడా మంచాలు, పరుపులు, ఇతర కనీస వసతులు కల్పిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 61 సంవత్సరాల క్రితం సత్రాలు నిర్మించారని చెప్పారు. కరోనా వల్ల రెండేళ్ళ పాటు వీటిని భక్తులకు కేటాయించలేక పోయామన్నారు. అందువల్ల కొంతమేరకు మరమ్మతులు అవసరమవుతాయన్నారు.

వీటికి అవసరమైన మరమ్మతులు చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ దాకా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

జెఈవో శ్రీ వీర బ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీమతి భారతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది