TTD TO OPEN CORONA AWARENESS CENTRES – ADDITIONAL EO _ మార్చి 13న కరోనా వైరస్‌పై అవగాహణ కేంద్రాలు ఏర్పాటు – టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి
Tirumala, 12 Mar. 20: To bring better awareness among visiting pilgrims to Tirumala and also to educate them on safety measures to prevent the spread of the Corona Virus (Covid 19), TTD is opening up three Awareness and Counselling camps at Alipiri and Srivari Mettu Footpath routes and also at Alipiri Toll Gate on March 13, said TTD Additional EO Sri AV Dharma Reddy.
After a hi-level review meeting with all the HoDs of Tirumala on Corona Virus at Gokulam Conference Hall on Thursday, the Additional EO directed all the HoDs to take up awareness and orientation programmes in their respective offices for their staff members. About the usage of masks, sensitizers etc. to prevent the spread of Corona Virus, as majority of the employees work in the places where the movement of the pilgrims is heavy.
He also instructed the SVBC to relay the promo on Corona Awareness and measures to prevent its spread, frequently in the channel for the wide publicity. He directed the TTD Health Officer Dr RR Reddy and CMO Dr Nageswara Rao to lead the Awareness camps and ensure that the message reaches every pilgrim who is reaching Tirumala.
He appealed to the devotees not to visit Tirumala, if they are suffering from cold, cough and mild fever until their illness subsides. “If any pilgrim is found suffering from the above symptoms, he or she will be screened with Thermo Screeners at Alipiri and Srivari Mettu itself and will be extended medical advice and Medicare if needed”, he added.
The Additional EO also said, TTD has taken a decision to facilitate Rs.300/- Special Entry Darshan, Arjitha Seva advance booking ticket holders as well the pilgrims who have booked Accommodation in advance, shall postpone their date of darshan or cancel the tickets till May 2020 in view of Corona Virus threat. Amount will be refunded to such pilgrims. The devotees who have any doubts regarding the cancellation of tickets shall mail to dyeotemple@gmail.com for immediate response and the same information shall be passed on to the Call Centre staff for guiding the pilgrims”, he instructed the PRO Dr T Ravi.
Meanwhile, the Health Department and Medical Wing of TTD are gearing up to make the arrangements to run the camps at both the footpath routes and also at Alipiri Toll Gate with enough number of Paramedical staffs and medicines as well as the screening equipment for the sake of the multitude of visiting pilgrims with the support of Engineering department which has set up the camps at these places.
SE 2 Sri Nageswara Rao, Temple DyEO Sri Harindranath, HoD IT Sri Sesha Reddy, Reception DyEOs Sri Balaji, Sri Damodaram, Annaprasadam DyEO Sri Nagaraja, Kalyanakatta DyEO Sri Selvam, VGO Sri Manohar and others were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 13న కరోనా వైరస్‌పై అవగాహణ కేంద్రాలు ఏర్పాటు – టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2020 మార్చి 12: తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని నివారించేందుకు మార్చి 13వ తేదీ అలిపిరి టోల్‌గేట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలలో ప్రత్యేక అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం అదనపు ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకునే భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదులు 2020 మే నెల 31వ తేదీ వరకు ముందస్తుగా ఆన్‌లైన్‌లో పొంది, తమ టికెట్లు రద్ధు చేసుకునే వారికి వారు చెల్లించిన నగదును తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భక్తులు తమ దర్శన తేదీలు మార్చుకునేందుకు ( రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు) dyeotemple@gmail.com అనే ఇ- మెయిల్‌కు పంపాలని సూచించారు. టిటిడి కాల్ సెంటర్‌కు ఈ విషయమై సంప్రదించే భక్తులకు అవసరమైన సమాచారం అందించాలని టిటిడి పిఆర్వో డా.టి.రవిని ఆదేశించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాల ద్వారా తిరుమలలోని ముఖ్య కూడళ్లలోనూ, రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాలలో నిరంతరాయంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భక్తులలో అవగాహన కల్పించేందుకు చిన్న ప్రోమో తయారు చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఎల్ఇడి స్క్రీన్‌లు ఉన్న ప్రాంతాలలో ప్రసారం చేయాలన్నారు. తిరుమలలో కరోనా వైరస్ సోకకుండా విస్తృతంగా వైద్య, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. తిరుమలలో విధులు నిర్వహించే టిటిడి ఉద్యోగులందరికి మాస్కులు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్ని ప్రాంతాలు, వసతి సమూదాయాలు, భక్తుల రద్ధీ అధికంగా ఉన్న ప్రాంతాలలో శానిటైజర్లు, ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటు రోగ నివారణ మందులతో పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు తిరుమలలోని ప్రథమచికిత్సకేంద్రాలు, అశ్వని ఆసుపత్రిలో సంప్రదించాలన్నారు.
ఈ సమావేశంలో ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, సిఎమ్‌వో డా. నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి, శ్రీ దామోదరం, శ్రీ సెల్వం, శ్రీ నాగరాజ, ఎస్ ఇ -2 శ్రీ నాగేశ్వరావు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.