TTD TO PROMOTE PANCHAGAVYA PRODUCTS _ ఎస్వీ గోశాల కార్యకలాపాలపై ఈఓ సమీక్ష

Tirupati, 17 Dec. 20: In its mission to protect and promote Desi Cow breeds and its products, TTD EO Dr KS Jawahar Reddy said an action plan will be prepared soon on Panchagavya products and its usage.

A review meeting on Panchagavya products was held in the Chamber of EO in TTD Administrative Building in Tirupati on Thursday. A team of Panchagavya experts from Govigyan Anusandhana Kendra from Nagpur presented in detail a documentary about the making, utility and future of Panchagavya through PowerPoint Presentation. 

Sri Sunil Mansinghka, member of Animal Welfare Board of India asserted that Panchagavya-the amalgamation of five basic products including the Milk, Curd, Ghee, Dung and the Urine which we get from the Cow is the traditional medicine which is going to command modern medicine in future.

Along with Dr Krishnamurthy, the President of Kamadugha Project of Karnataka, he elaborated on the various uses of Panchagavya in various fields including health, daily care, agriculture etc. They said, the Panchagavya elements have the power to cure many diseases and increase resistance power, rejuvenate the cells, control even dreadful diseases like cancer. They sought the co-operation of TTD in preparing and promoting Panchagavya products.

Responding to their request, TTD EO said a committee will be formed to study in detail about the Panchagavya products involving the experts from the Veterinary University of Tirupati also. He directed Gosala Director Dr Harinath Reddy to come out with a detailed action plan by January next.

JEO Sri P Basanth Kumar, SV Vedic University Vice-Chancellor Sri Sannidhanam Sudarshana Sarma,TTD Ayurvedic College Principal Smt Padmavathi, Incharge of Ayurvedic Pharmacy Sri Narappa Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ గోశాల కార్యకలాపాలపై ఈఓ సమీక్ష

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 17: ఎస్వీ గోశాల కార్యకలాపాలపై టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి గురువారం తిరుపతిలోని పరిపాలన భవనంలో గల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ పంచగవ్య ఉత్పత్తులపై అధ్యయనం చేసేందుకు ఎస్వీ వెటర్నరీ వర్సిటి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించి జనవరి నాటికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని గోశాల డైరెక్టర్ ను ఆదేశించారు.

ముందుగా నాగ్ పూర్ లోని గోవిగ్యాన్ అనుసంధాన్ కేంద్రం ప్ర‌తినిధులు పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ, వినియోగంపై ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. భార‌త జంతు సంక్షేమ బోర్డు స‌భ్యుడు శ్రీ సునీల్ మాన్‌సింగ్‌క‌ర్ మాట్లాడుతూ పంచ‌గ‌వ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, పేడ‌, గోమూత్రాన్ని చాలాకాలం నుంచి సంప్ర‌దాయ వైద్యంలో వినియోగిస్తున్నార‌ని చెప్పారు. క‌ర్ణాట‌క కామ‌డుగ ప్రాజెక్టు ప్రెసిడెంట్ డా. కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ ఆరోగ్య‌, వ్య‌వ‌సాయ రంగాల్లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల వినియోగం గురించి తెలియ‌జేశారు. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు క్యాన్స‌ర్ లాంటి వ్యాధుల‌ను నియంత్రించే శ‌క్తి ఈ ఉత్ప‌త్తుల‌కు ఉంద‌న్నారు. పంచ‌గవ్య ఉత్పత్తుల త‌యారీలో టిటిడికి స‌హ‌కారం అందిస్తామ‌న్నారు.

ఈ స‌మీక్ష‌లో జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ విసి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి, ఆయుర్వేద ఫార్మ‌సీ ఇన్‌ఛార్జి డాక్ట‌ర్ నార‌ప‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.