TTD TO RELEASE RS. 300 SED TICKETS ON OCTOBER 7 _ అక్టోబర్ 7న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

CANCELLATION OF VIP BREAK AND PRIVILEGED DARSHANS FROM OCTOBER 11-20

Tirumala, 06 October 2026: TTD will release Rs.300 Special Entry Darshan(SED) tickets for October 12, 13, 14, 18, 19, and 20  on October 7 (Wednesday) at 10 AM on its official website.

Devotees are requested to book these tickets only through https://ttdevasthanams.ap.gov.in

VIP Break and Privilege Darshans cancelled

In view of the Srivari Navaratri Brahmotsavams from October 12–20 that has coupled with the last week of Peratasi month, which is expected to draw a heavy pilgrim rush, TTD had cancelled VIP Break and privileged darshans from October 11 to 20:

Privileged Darshans

Darshans for senior citizens, physically challenged, parents with infants, NRIs, and defence personnel stands cancelled during that period.

Except for Protocol VIPs, No Recommendation letters for VIP Break Darshan will be accepted from October 10 to 19.

Devotees are requested to plan their Tirumala visit keeping these changes in mind and cooperate with TTD.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

అక్టోబర్ 7న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమ‌ల‌, 2026 అక్టోబ‌ర్ 06: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7వ తేది ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు తిరుమ‌ల‌లో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించనుండ‌టంతో పాటు పెర‌టాసి మాసం చివరి వారం కావ‌డంతో భ‌క్తుల అధిక ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప‌ది రోజుల పాటు ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మిన‌హా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేయ‌డం జ‌రిగింది.

వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు సంబంధించి అక్టోబ‌ర్ 10వ తేది నుండి 19వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.

ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని భ‌క్తులు త‌మ తిరుమ‌ల యాత్ర‌ను రూపొందిచుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.