TTD TO RELEASE SEPTEMBER QUOTA OF Rs 300 SPECIAL DARSHAN TICKTES ON AUGUST 24 _ ఆగస్టు 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సెప్టెంబరు కోటా విడుదల
Tirumala, 23 Aug. 20: TTD will release the September quota of Rs 300 special darshan online tickets at 11 am of August 24.
However, TTD has cancelled these tickets on September 15 and from September 18-27 in view of Koil Alwar Tirumanjanam on September 15 and thereafter Srivari annual Brahmotsavams from Sep 18 till Sep 27.
TTD has appealed to devotees to notice the changes while booking their online advance Rs 300 special darshan tickets.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సెప్టెంబరు కోటా విడుదల
తిరుమల, 2020 ఆగస్టు 23: భక్తుల సౌకర్యార్థం 2020 సెప్టెంబరు నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 24వ తేదీ ఉదయం 11.00 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
ఇందులో సెప్టెంబరు 15న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం, సెప్టెంబరు 18 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనము టికెట్లను టిటిడి రద్దు చేసింది.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.