TTD TO REVAMP ANNAPRASADAM – EO _ మ‌రింత రుచిక‌రంగా అన్నప్రసాదాల త‌యారీకి చ‌ర్య‌లు- ⁠గ‌ణ‌తంత్ర దినోత్స‌వ ప్ర‌సంగంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి

TIRUMALA, 26 JANUARY 2024: As a part of providing enhanced services to the scores of pilgrims visiting Tirumala, TTD is set to revamp the Annaprasadam wing, said TTD EO Sri AV Dharma Reddy.

The chief motto of TTD is offer the best possible services to the multitude of visiting pilgrims across the country. We are contemplating strengthen the Annaprasadam wing to enhance its quality by bringing up professionalism in the department.

With the blessings of Sri Venkateswara Swamy, we are blessed with sufficient water in all our dams to suffice the drinking water needs of the pilgrims for the next couple of years with the heavy downpour which occurred on December 6 last.

Similarly in the last six months since August last, we have brought many reforms in Accommodation, Annaprasadam, successfully conducted twin Brahmotsavams, Vaikunthadwara Darshan, revamped education system in SV High School at Tirumala and many more.

On this occasion I reiterate to all the employees of TTD, Vigilance and Security, police and others to dedicate yourselves in the service of the scores of pilgrims and bless your lives and complimented the media for playing a vital role in taking forward the Hindu Dharmik programs mulled by TTD.

Earlier, the EO unfurled the National Flag on the occasion of the 75th Republic Day at Gokulam Rest House.

SE2 Sri Jagadeeshwar Reddy, VGO Sri Nanda Kishore, heads of various departments, employees were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మ‌రింత రుచిక‌రంగా అన్నప్రసాదాల త‌యారీకి చ‌ర్య‌లు

•⁠ ⁠అన్న‌ప్ర‌సాద విభాగం పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌

•⁠ ⁠రెండేళ్ల వ‌ర‌కు నీటి కొర‌త లేదు

•⁠ ⁠గ‌ణ‌తంత్ర దినోత్స‌వ ప్ర‌సంగంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2024 జనవరి 26: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం దేశం న‌లుమూల‌ల నుండి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత రుచిక‌రంగా, నాణ్యంగా అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు అన్న‌ప్ర‌సాద విభాగాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి వృత్తి నైపుణ్యం పెంచేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంత గృహంలో ఈవో జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో గతేడాది డిసెంబరు 6న కురిసిన భారీ వర్షంతో తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాల‌న్నీ నిండాయ‌ని, రానున్న రెండేళ్ల పాటు తిరుమ‌ల‌కు నీటి కొర‌త ఉండ‌ద‌ని తెలిపారు. గత ఆగస్టు నుంచి ఆరు నెలల వ్య‌వ‌ధిలో మెరుగైన వసతి, అన్నప్రసాదాల‌తోపాటు, రెండు బ్రహ్మోత్సవాలు, వైకుంఠద్వార దర్శనం, తిరుమల ఎస్వీ హైస్కూల్‌లో విద్య‌ప్ర‌మాణాలు పెంపు త‌దిత‌ర ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామ‌న్నారు. టీటీడీ ఉద్యోగుల‌తోపాటు నిఘా, భ‌ద్ర‌తాసిబ్బంది, పోలీసులు మ‌రింత అంకిత‌భావంతో ప‌నిచేసి భ‌క్తుల సేవ‌లో పున‌రంకితం కావాల‌ని, త‌ద్వారా మీ జీవితాల‌ను ధన్యం చేసుకోవాలని కోరారు. టీటీడీ నిర్వ‌హిస్తున్న‌ హిందూ ధార్మిక కార్యక్రమాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోంద‌ని అభినందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఇ-2 శ్రీ‌ జగదీశ్వర్ రెడ్డి, విజివో శ్రీ నందకిషోర్, వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.