TTD TRUST BOARD MEETING RESOLUTIONS_ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

Tirumala, 24 July 2018: The TTD Trust Board Meeting under the Chairmanship of Sri Putta Sudhakar Yadav has taken some important decisions. Some excerpts:

@ Sravana Pournami Managudi and Varalakshmi Vratam will be observed under the aegis of Hindu Dharma Prachara Parishad (HDPP) from August 23 to 26.

@ Reorganisation of Dharma Prachara Mandali members in all districts of AP and TS to effectively take forward HDPP activities.

@ Introduce Abhisheka Seva on Fridays in Sri Konetiraya Swamy temple in Keelapatla with a ticket priced at Rs.300 on which two persons will be allowed.

@ Approval to call tenders worth Rs.11cr towards second phase of development works of Avilala Spiritual Park.

@ To call Tenders for works worth Rs.7cr to convert 76 F type quarters into suites to be allotted to pilgrims.

@ Two posts of Archakas vacancies filled in Sri Padmavathi Ammavari temple by carrying out interviews with experts. Similarly the vacancies in Sri Govinda Raja Swamy temple, Sri Kodanda Rama Swamy temple and Nagulapuram will soon be filled up.

@ Nod to give one time lumpsum amount to retired mirasi archakas and Pradhana archakas which is fixed as Rs.20lakhs and Rs.30lakhs respectively.

@ Introduction of VIP Protocol Break darshan in Tiruchanoor between 11.30am and 12noon and between 7pm and 7.30pm with causing inconvenience to common pilgrims. Price of each ticket fixed at Rs.250.

@ To issue 10grams gold dollars to retired employees in the place of existing 8grams gold dollars

@Revision of Rest House Extension Policy. If the donors who enjoyed the donation privileges on rest Houses for 20 years wants to continue, then they will have to bear the construction cost of the respective rest House to the present day market rate. If they come forward to bear half of the amount, then they will be extended donor privileges for ten years. If multiple donors comes, then privileges will be extended by taking lottery.

@Sanction of Rs.23crores towards construction of queue lines, electrification, drinking water supply etc.from SD complex to Alwar Tank Rest House.

@ Sanction of Rs.10crores to construct a road from MBC junction to VQC II junction along the queue line.

TTD EO Sri Anil Kumar Singhal, Sri Bonda Umamaheswara Rao, Sri GSS Sivaji, SRI. BK Parthasaradhi, Sri Dokka Jagannadham, Sri Rayapati Sambasiva Rao, Sri Challa Ramachandra Reddy, Sri E Peddi Reddy, Sri Potluri Ramesh Babu, Sri Sandra Venkata Veeraiah, Smt Sudha Narayanamurthy, Smt Sapana Sudhir Mungantiwar, Sri Rudra Raju Padma Raju, Sri Meda Ramakrishna Reddy, Sri Dokka Jagannadham, Ex Officio Members, Dr Manmohan Singh, Smt YV Anuradha, Spl Invitee Sri N Sri Krishna, Sri B Ashok Reddy, Sri K Raghavendra Rao, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

జూలై 24, తిరుమల 2018: టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

– ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా పరిమిత సంఖ్యలో ఎంత మందికి సాధ్యమైతే అంతమంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తాం. రోజుకు ఎంతమందిని అనుమతిస్తామనే విషయాన్ని 2, 3 రోజుల్లో తెలియజేస్తాం. ఆయా రోజల్లో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్‌ దర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్యదర్శనాలను రద్దు చేశాం.

– తిరుమలలో అతిథిగృహాలకు సంబంధించి పూర్తి నిర్మాణ వ్యయాన్ని భరిస్తే 20 ఏళ్ల వరకు, 50 శాతం నిర్మాణ వ్యయాన్ని భరిస్తే 10 ఏళ్ల వరకు దాతలుగా పరిగణించి ప్రయోజనాలు కల్పిస్తాం.

– వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో మనగుడి కార్యక్రమం నిర్వహణకు ఆమోదం.

– హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు సహాయసహకారాలు అందించే జిల్లా ధర్మ ప్రచార మండలి, మండల ధర్మప్రచార మండలి సభ్యుల కార్యనిర్వాహకవర్గం పునర్‌వ్యవస్థీకరణకు ఆమోదం.

– చిత్తూరు జిల్లా కీలపట్లలో వెలసిన శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో ప్రతి శుక్రవారం ఆర్జితసేవగా అభిషేక సేవను నిర్వహించడానికి ఆమోదించడమైనది. ఇద్దరు సభ్యులకుగాను ఆర్జిత సేవా టికెట్‌ ధర రూ.300/-గా నిర్ణయం.

– తిరుపతిలోని అవిలాల చెరువును ఆధ్యాత్మిక, పర్యావరణ పార్కుగా తీర్చిదిద్దడానికి రెండో దశలో రూ.11 కోట్లతో అభివృద్ధి పనులకై టెండర్లు పిలిచేందుకు నిర్ణయం.

– తిరుమలలోని 76 ఎఫ్‌ టైప్‌ నివాసగృహాలను సూట్‌లుగా మార్చి యాత్రికులకు కేటాయించడానికిగాను రూ.7 కోట్లతో టెండర్లు ఆహ్వానించడానికి ఆమోదం.

– తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 2, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో 2, శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 3, నాగులాపురంలోని శ్రీవేదనారాయణస్వామివారి ఆలయంలో 2 అర్చక ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.

– టిటిడిలో పదవీ విరమణ పొందిన పూర్వపు మిరాశీ ప్రధానార్చకులకు రూ.30 లక్షలు, మిరాశీ అర్చకులకు రూ.20 లక్షలు ఒకేసారి చెల్లించేందుకు ఆమోదం.

– తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ప్రొటోకాల్‌ వర్తించే ప్రముఖులకు దర్శనం అందించడంలో భాగంగా ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 7 గంటల నుండి 7.30 గంటల వరకు హారతి, తీర్థం, శఠారి ఏర్పాటు చేస్తూ బ్రేక్‌ దర్శనం ప్రవేశపెట్టేందుకు ఆమోదం. ఈ టికెట్‌ ధర రూ. 250/-గా నిర్ణయం.

– రూ.23 కోట్లతో భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని సర్వదర్శనం క్యూకాంప్లెక్స్‌ నుండి ఆళ్వార్‌ ట్యాంక్‌ విశ్రాంతిగృహం గేటు వరకు క్యూలైను, విద్యుత్‌, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయం.

అదేవిధంగా, రూ.10 కోట్ల వ్యయంతో ఎంబిసి కూడలి నుండి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 కూడలి వరకు క్యూలైన్‌ వెంబడి నూతనంగా రోడ్డు ఏర్పాటుకు నిర్ణయం.

– టిటిడిలో పదవీ విరమణ పొందిన క్రమబద్ధ (రెగ్యులర్‌) ఉద్యోగులను సత్కరించడానికి ప్రస్తుతం బహూకరిస్తున్న 8 గ్రాముల బంగారు డాలర్‌ స్థానంలో 10 గ్రాముల డాలర్‌ బహూకరించేందుకు ఆమోదం.

ఈ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవోలు శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీపోల భాస్కర్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ జిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీబోండా ఉమామహేశ్వర్‌రావు, శ్రీరాయపాటి సాంబశివరావు, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, శ్రీసండ్ర వెంకటవీరయ్య, శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీ డొక్కా జగన్నాథం, శ్రీమతి సప్న, శ్రీ బికె.పార్థసారధి, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ మన్మోహన్‌ సింగ్‌, కమిషనర్‌ శ్రీమతి వైవి.అనూరాధ, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, శ్రీ అశోక్‌రెడ్డి, శ్రీ ఎన్‌.శ్రీకృష్ణ పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.