TTD BOARD APPROVES Rs 2927.82 CR BUDGET FOR 2021-22 _ రూ. 2937 . 82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు ఆమోదం

ARJITA SEVAS TO RESUME FROM APRIL 14

Tirumala, 27 Feb. 21: The TTD board under the chairmanship of Sri YV Subba Reddy had taken some important resolutions during the board meeting held at Annamayya Bhavan in Tirumala on Saturday. Some excerpts:

– The board approved Rs.2937.82cr budget for the financial year 2021-22.

– To resume arjitha sevas in Tirumala temple from April 14 onwards

-TTD to allow devotees physical presence for advance booked arjita sevas. Devotees with arjita Seva tickets should observe all Covid guidelines and also procure Covid test three days ahead of their Tirumala visit.

–       The TTD board approved a proposal of Sri Padmavati temple of Tiruchanoor to launch Tulabhara seva on the lines of Srivari Temple, Tirumala.

–       Decided to frame certain guidelines for taking over temples by TTD. To provide financial assistance to taken over temples from SRIVANI Trust. Also taken a decision to frame uniform guidelines for leasing and construction of TTD Kalyana Mandapams. An integrated system will be formulated to reduce losses in operating Kalyana Mandapams.

–       Board endorsed a proposal to name all the six Veda Pathashalas run by TTD henceforth as Sri Venkateswara Veda Vijnana Peetham and hike the remuneration of Vedic teachers at all Pathashalas from existing Rs.22,000 to Rs.35,150 

–       Board sanctioned Rs 9 crore towards electrical and civil works to promote a Sri Venkateshwara Paediatric hospital on the first floor of the old OPD Bhavan of the BIRRD hospital. Approved tenders for Rs 3.75 crore towards the extension of the 3rd floor in the new OPD Bhavan of the BIRRD hospital.

–       Board also approved proposals for increasing the capacity storage of ghee used in the preparation of TTD Prasadam and Anna Prasadam from 82.4 tonnes to 180.4 metric Tonnes thereby enhancing the storage period from 6 days to 14 days.

–       Installing APSPDL meters at all rest houses, cottages, choultries etc. in Tirumala to enhance transparency in power consumption. To produce 50mega watts of the green power conventional energy in Tirumala.

–       Following the medical advice, Board decided to provide Covid vaccination to all TTD employees.

–       TTD to perform Bhumi pujas soon for construction of Srivari temples at Mumbai and Jammu.

–       The board also given nod to declare Cow as National Animal and will recommend the same to the Centre

–       The board also decided to construct either Srivari temple or Bhajana Mandiram or Amenities Complex in Ayodhya, if the Ayodhya Ram Mandir Nirman Trust comes forward to allot land to TTD. 

TTD Board Members Sri UV Ramana Murthy Raju, Sri Meda Mallikarjuna Reddy, Sri P Murali Krishna, Sri J Rameswara Rao, Smt V Prasanthi, Dr B Parthasaradhi Reddy, Dr Nichitha, Sri N Subba Rao, Sri DP Anantha, Sri Ramesh Shetty, Sri V Bhaskara Rao, Sri M Ramulu, Sri D Damodar Rao, Sri Chippagiri Prasad, Sri MS Siva Sankaran, Sri K Shiva Kumar, TTD Ex-officio including TTD EO Dr KS Jawahar Reddy, Smt G Vani Mohan- Prl Secretary to Government of AP (Revenue), Endowments Commissioner Sri Arjun Rao, TUDA Chairman, Chief Whip, Chandragiri legislator Sri C Bhaskar Reddy, Spl Invitees Sri B Karunakar Reddy, Sri J Sekhar, Sri Kupendra Reddy, Sri Govind Hari, Sri Dusmantha Kumar Das, Addl EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, FACAO Sri Balaji, CE Sri Ramesh Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రూ. 2937 . 82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు ఆమోదం

– ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

– గోవును జాతీయ ప్రాణి గా గుర్తించాలని తీర్మానం

– టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్

టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 27 ఫిబ్రవరి 2021: తిరుమల తిరుపతి దేవస్థానం 2021 – 22 బడ్జెట్ ను రూ. 2937.82 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని నిర్ణయించి నట్లు ఆయన వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ ఆ వివరాలు తెలిపారు.

– 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి గాను టీటీడీ బడ్జెట్ రూ. 2937. 82 కోట్లు గా ఆమోదించడమైనది.

– గుడికో గోమాత కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందన వల్ల గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానించాము.

– ముందస్తుగా బుకింగ్ చేసుకున్న భక్తులను ఏప్రిల్ 14వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతిస్తాం

– ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలి.

– తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెట్టేందుకు ఆమోదం


– టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధి విధానాలను నిర్ణయించడం జరిగింది. ఇలాంటి ఆలయాలకు శ్రీవాణీ ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది.

– టీటీడీ కళ్యాణ మండపాలు నిర్మాణం, లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏక రూప మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయం.

ఉన్న కళ్యాణమండపాలు సక్రమంగా నిర్వహించి నష్టాలు తగ్గించుకోవాలని నిర్ణయం

– టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం గా మార్చేందుకు ఆమోదం


– బర్డ్ ఆసుపత్రిలోని పాత ఓపిడి భవనం, మొదటి అంతస్తులో శ్రీ వేంకటేశ్వర పీడియాట్రిక్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి సివిల్, ఎలక్రిటికల్, ఏసీ తదితర అభివృద్ధి పనులకు రూ 9 కోట్ల.మంజూరుకు ఆమోదం

అదేవిధంగా కొత్త ఓపిడి భవనంలో మూడవ అంతస్తు విస్తరణ పనులకు రూ.3.75 కోట్లతో టెండర్ల ఆమోదం

– టీటీడీ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి
ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్ టన్నుల నుండి 180. 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం. తద్వారా నెయ్యి నిల్వలను ఆరు రోజుల నుంచి 14 రోజులకు పెంచుకోవచ్చు

– తిరుమలలోని అన్ని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద విద్యుత్ వినియోగానికి సంబంధించి జవాబుదారీ తనం పెంచేందుకు AP SPDCL ద్వారా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం. తిరుమలలో క్రమంగా 50 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయం.

– తిరుమలలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులందరికీ డాక్టర్ల సూచనలు పాటిస్తూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించేందుకు తీర్మానం.

– త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడానికి నిర్ణయం.

-. శ్రీవారి మెట్టు మార్గంలో నడచి వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్ణయం

– అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్ టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయం లో వారు ఏది కోరితే అది నిర్మించాలని నిర్ణయం.

మీడియా సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ శివకుమార్, శ్రీ గోవింద హరి, డిపి అనంత, శ్రీ రాములు, డాక్టర్ వాణి మోహన్ పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.