TTD VIG SLEUTHS NAB DALARIS _ టిటిడి విజిలెన్స్ అదుపులో ద‌ర్శ‌న టికెట్ల దళారులు

TIRUMALA, 24 JANUARY 2022: TTD Vigilance Wing sleuths nab two Dalaris in Tirumala and file a complaint against them in Two Town Police Station at Tirumala.

 

According to TTD Vigilance, the Vigilance sleuths carried out checking at Rs. 300 scanning point in the above said point on 23rd January and on suspicion enquired one Sri S.Saidulu and six of his relatives from Hyderabad who told them that they paid Rs.5600/- through Google Pay and cash of Rs.1000/- to one Sri Venu and Sri Vinay towards seven Rs. 300 tickets.

 

It has been found that Venu works as a private Photographer in Tirumala while Vinay hails from Kadapa. They arranged for the devotees seven fake and fabricated tickets by making necessary data alterations.

 

Following the complaint given by the pilgrims, the TTD Vigilance cops filed a complaint against the two middlemen with the Tirumala police. A case was registered in Cr.no.11/ 2022, U/S 420 & 468 IPC at Tirumala II Town Police Station on Sunday. 

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి విజిలెన్స్ అదుపులో ద‌ర్శ‌న టికెట్ల దళారులు

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 24: తిరుమలలో ఇద్దరు రూ. 300/- ద‌ర్శ‌న టికెట్ల‌ దళారులను టిటిడి విజిలెన్స్ విభాగం పట్టుకుని, వారిపై తిరుమలలోని టు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.

ఈ న‌కిలీ టికెట్ల విక్ర‌యంలో కడపకు చెందిన వినయ్‌, తిరుమలలో ప్రైవేట్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న వేణు ఉన్న‌ట్లు గుర్తించారు. ఇందుకు అవసరమైన డేటా మార్పులు చేయడం ద్వారా వారు భక్తులకు ఏడు నకిలీ టిక్కెట్లను ఏర్పాటు చేసి, విక్ర‌యించిన‌ట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.

టిటిడి విజిలెన్స్ అధికారులు అందించిన సమాచారం మేరకు, జనవరి 23న రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల స్కానింగ్ కౌంట‌ర్ల వ‌ద్ద టిటిడి విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ ద‌ర్శ‌న టిక్కెట్ల‌ను పట్టుకున్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన శ్రీ ఎస్.సైదులు మరియు అతని ఆరుగురు బంధువులను విచారించగా, త‌మ‌కు వేణు, విన‌య్ క‌లిసి ఏడు రూ. 300/- టికెట్ల‌ను విక్ర‌యించిన‌ట్లు తెలిపారు. తాము వారికి గూగుల్ పే ద్వారా రూ.5600/-, క్యాష్ రూపంలో రూ. 1000/- అందించిన‌ట్లు చెప్పారు.

యాత్రికుల ఫిర్యాదు మేరకు టిటిడి విజిలెన్స్ అధికారులు ఇద్దరు ద‌ళారుల‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తిరుమల టు టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో Cr.no.11/ 2022, U/S 420 & 468 IPC క్రింద కేసు నమోదైంది.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.