TTD VIG SLEUTHS SEIZE A LIGHT WEIGHT PLASTIC DRONE _ ఘాట్ రోడ్డులో తేలికపాటి ప్లాస్టిక్ డ్రోన్ స్వాధీనం
Tirumala, 12 January 2024: The TTD vigilance sleuths have seized a light weight plastic drone which was flown on the first ghat road of Tirumala by a person who was not aware of the TTD rules.
Sri. Dinesh from Haryana flew the lightweight plastic folded Nano drone at the 53rd turn of the first (Down) Ghat Road.
As it is a small plastic drone, it could not be detected even at the Alipiri scanning point.
Further investigation will continue. The TTD vigilance officials handed over the drone along with the person to the Tirumala police.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఘాట్ రోడ్డులో తేలికపాటి ప్లాస్టిక్ డ్రోన్ స్వాధీనం
తిరుమల, 12 జనవరి 2024: టీటీడీ నిబంధనలపై అవగాహన లేని వ్యక్తి తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఎగురవేసిన తేలికపాటి ప్లాస్టిక్ డ్రోన్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హర్యానాకు చెందిన శ్రీ దినేష్ తేలికపాటి ప్లాస్టిక్ ఫోల్డెడ్ నానో డ్రోన్‌ను ఘాట్ రోడ్డులో 53వ మలుపు వద్ద ఎగురవేశారు. ఇది చిన్న ప్లాస్టిక్ డ్రోన్ కావడంతో అలిపిరి స్కానింగ్ పాయింట్‌లో సైతం గుర్తించడం సాధ్యం కాలేదు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు డ్రోన్ తోపాటు సదరు వ్యక్తిని తిరుమల పోలీసులకు అప్పగించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.