TTDs IS COMMITTED TOWARDS DHARMIC AND SOCIO-ECONOMIC RENAISSANCE- TTD EO _ టిటిడి కార్యనిర్వహణాధికారి గణతంత్ర దినోత్సవ ప్రసంగం

Tirupati, 26 Jan. 20: Tirumala Tirupati Devasthanams is committed towards the for propagation, promotion and preservation of sanatana Hindu dharma linked to Socio-Economic development of the society, said TTD EO Sri Anil Kumar Singhal.

In his Republic Day address to TTD employees at parade grounds of the administrative building on Sunday, the EO highlighted the activities of TTD and also its innovative strategies for religious promotion, devotees welfare and TTD employees welfare.

He thanked the generosity of 36,000 donors who contributed nearly ₹386 crores to TTD during for promotion of all its activities.

TTD has successfully conducted all prestigious and challenging events like the annual brahmotsavams, Vaikuntha Ekadasi at Tirumala. All preparations are underway for the successful conduction of Ratha sapthami festival at Tirumala on February 1, he added.

The EO said from January 20th the TTD had launched another unique devotees welfare program of free distribution of one laddu to each devotee after Srivari darshan and facility to buy additional laddus without any recommendations.

Another innovative measure of TTD was to honour the donors to Sri Venkateswara Alaya Nirmana (SRIVANI) Trust aimed to build Srivari temples in weaker section colonies linked with the privilege of one time VIP break darshan ticket on the contributions crossing Rs.10, 000. TTD has also initiated one-day meal scheme in Annaprasadam, he mentioned.

He said TTD has taken up construction of Srivari temples at various places including –

*  Mumbai (₹30 cr), Visakhapatnam (₹25 cr), Bhubaneswar (₹6.7 cr) Chennai (₹5.75cr), Seethampeta, Parvatipuram, Rampachodavaram (₹13.60).

* PAC-5 for 2500 devotees at ₹70 cr, Sri Vakulamata rest house at Tirumala at ₹42.86 cr.

* Queuelines, toilets etc. at Narayanagiri gardens at ₹41 crore.

* Hostels for TTD educational institutions for 3900 students at ₹100cr.

TTD has undertaken several other programs for propagation of sanatana Hindu dharma and will be conducting Venkateswara Vaibhavotsavams in a big way.

TTD board had also resolved to give 75% quota to Chittor district in all appointments of junior assistants In TTD and the posts of junior assistants would be filled ad hoc department wise as per requirement, he added.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

టిటిడి కార్యనిర్వహణాధికారి గణతంత్ర దినోత్సవ ప్రసంగం

జనవరి 26, తిరుపతి 2020: భారత గణతంత్ర దినోత్సవం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఆదివారం ఘనంగా జ‌రిగింది. ఈ సందర్భంగా టిటిడి కార్య‌నిర్వ‌హ‌ణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్ ఉద్యోగుల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివ‌రాలు వారి మాటల్లోనే….

ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల కైంకర్యాలను నిర్వహిస్తున్న ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంత సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మరియు మీడియా మిత్రులకు 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ భారత గణతంత్ర జాతీయ పర్వదినం రోజున టిటిడి భక్తులకు చేస్తున్న అనేకసేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

శ్రీవారి ఆలయం :  

– తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర టిటిడి ఆలయాలలో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి లాంటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాం. ఈ ఉత్సవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా, రానున్న ఫిబ్రవరి1న జరుగనున్న రథసప్తమికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేపడుతున్నాం.

– టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం.

– జనవరి 20వ తేదీ నుండి శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ ఒక లడ్డూను ప్రసాదంగా అందజేస్తున్నాం. అదనంగా లడ్డూలు కావాల్సిన భక్తులు ఎలాంటి సిఫార్సు లేకుండా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాం.

– ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని బోర్డు నిర్ణయించింది. ఈ ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించిన దాతలకు ఒకసారి విఐపి బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నాం.

శ్రీవారి ఆలయాల నిర్మాణం :  

– విశాఖపట్నంలో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాన్ని ఏప్రిల్‌లో పూర్తిచేసి మే నెలలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తాం.

– ముంబయిలో రూ.30 కోట్లతో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి త్వరలో భూమిపూజ చేస్తాం.

– రూ.6.7 కోట్లతో భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయం, రూ.5.75 కోట్లతో చెన్నైలో శ్రీ పద్మావతి ఆలయ నిర్మాణపనులు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా, రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరంలో రూ.13.50 కోట్లతో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడుతున్నాం.

– జమ్మూ మరియు వారణాశిలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇందుకు అనువైన స్థలాల కొరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తున్నాం.

ఇంజినీరింగ్‌ పనులు :

– తిరుమలలో భక్తులకు వసతిని పెంచడంలో భాగంగా రూ.79 కోట్లతో 2,500 మందికి సరిపడా పిఏసి-5 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

– 1400 మంది భక్తులకు సరిపడా తిరుమలలో రూ.42.86 కోట్లతో నిర్మించిన మాత శ్రీ వకుళాదేవి విశ్రాంతి గ హాన్ని ఇటీవల ప్రారంభించాం.

– తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తుల సౌకర్యార్థం రూ.39.41 కోట్లతో క్యూలైన్లు, మరుగుదొడ్లు, బిటిరోడ్లు, ఫుట్‌పాత్‌లు నిర్మించాం.

– తిరుచానూరు రోడ్డులోని శ్రీనివాస, పద్మావతి కల్యాణమండపాల్లో రూ.21 కోట్లతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.

– తిరుమల-తిరుపతి రెండో ఘాట్‌ రోడ్డులో ప్రమాదాల నివారణకు రూ.18 కోట్లతో ఆర్‌సిసి క్రాష్‌ బ్యారియర్లు, సిసి కెర్బ్‌ వాల్స్‌, బిటి రోడ్ల నిర్మాణపనులు జరుగుతున్నాయి.

– టిటిడి విద్యాసంస్థల్లోని 3,900 మంది విద్యార్థులకు బస కల్పించేందుకు హాస్టల్‌ భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాం. రూ.46 కోట్లతో 900 మందికి సరిపడా శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల హాస్టల్‌ భవనాలు పూర్తి కావస్తున్నాయి. అదేవిధంగా, మిగిలిన విద్యాసంస్థల్లో రూ.110.50 కోట్లతో చేపట్టిన హాస్టల్‌ భవనాల నిర్మాణపనులు పలు దశల్లో ఉన్నాయి.

– నడకదారి భక్తుల సౌకర్యార్థం అలిపిరి మార్గంలో గతంలో నిర్మించిన పైకప్పు శిథిలావస్థకు చేరుకోవడంతో రూ.30 కోట్లతో రిలయన్స్‌ సంస్థ సహకారంతో పైకప్పు పునర్నిర్మాణ పనులను ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభిస్తాం.

– భక్తుల సౌకర్యార్థం రూ.110 కోట్లతో తిరుమలలో కాటేజీలు, చౌల్ట్రీలు, వసతిగదుల్లో మరమ్మతులు మరియు ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

– గోవు మహత్యాన్ని తెలిపేలా అలిపిరిలో దాదాపు రూ.10 కోట్లతో సప్తగోప్రదక్షిణశాలను దాత సహకారంతో నిర్మిస్తున్నాం.

– తిరుమలలో టాటా ట్రస్టు వారిచే అశ్విని ఆసుపత్రి ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వచ్చే నెల నుండి రోగులకు అందుబాటులోకి తెస్తాం.

హిందూ ధర్మప్రచార పరిషత్‌ :

– హిందూ ధర్మప్రచార పరిషత్‌ ద్వారా మనగుడి, శుభప్రదం, శ్రీనివాస కల్యాణాలు, అర్చక శిక్షణ, సదాచారం, సనాతన ధార్మిక పరీక్షలు లాంటి కార్యక్రమాల ద్వారా సనాతన హైందన ధర్మ ప్రచారం చేస్తున్నాం.

– తమిళనాడులో నిర్వహిస్తున్న శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాల తరహాలో శ్రీ అన్నమయ్య ఉత్సవాలను రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా నిర్వహించాలని బోర్డు ఆమోదించి ప్రభుత్వానికి విన్నవించడమైనది.

– ధర్మప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పూర్తయిన 500 ఆలయాలకు ఒక్కొక్క ఆలయానికి రూ.36 వేల వ్యయంతో భజన సామగ్రి, మైక్‌సెట్లు, గొడుగులను అందించేందుకు, ఆధ్యాత్మిక పుస్తకాలతో మినీ గ్రంథాలయం ఏర్పాటుకు బోర్డు ఆమోదించింది. అదనంగా మరో 500 ఆలయాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

– శిథిలావస్థలో ఉన్న కొన్ని వైష్ణవ దివ్యదేశాల ఆలయాల పునర్నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

– వేదపారాయణ పథకం, కుమార అధ్యాపక పథకం, ఆహితాగ్నుల పరిరక్షణ పథకం, వృద్ధ ఆగమ పండితుల పరిరక్షణ పథకం తదితర పథకాల్లో ఇస్తున్న ఆర్థికసాయం మీద వచ్చిన సలహాలు, సూచనలను టిటిడి బోర్డు పరిశీలిస్తోంది.

– లోకకల్యాణం కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలుప్రాంతాల్లో చతుర్వేదహవనం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

– గీతా జయంతి సందర్భంగా తిరుపతిలో 10 వేల మంది విద్యార్థులతో నిర్వహించిన సామూహిక గీతాపారాయణానికి విశేష స్పందన లభించింది.

– శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దేశంలోని 17 రాష్ట్రాల నుండి 40 బృందాల్లో 634 మంది కళాకారులు ఆయా సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఇచ్చిన ప్రదర్శనలను భక్తులు ఎంతగానో ప్రశంసించారు.

– శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను తిరిగి నిర్వహించాలని నిర్ణయించాం.

– బాలబాలికలకు ఆధ్యాత్మిక, మానవీయ, నైతిక విలువలు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు త్వరలో ప్రతినెలా సప్తగిరి మాసపత్రికకు అనుబంధంగా ‘బాల సప్తగిరి’ని అందుబాటులోకి తీసుకొస్తాం.

విద్య :

– గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థినీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి తిరుపతిలో ‘స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

– టిటిడి డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు చదువు పూర్తి కాగానే ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో చేపట్టాలని నిర్ణయించాం.

– విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోటాను రద్దు చేసి పూర్తిగా మెరిట్‌ప్రాతిపదికన విద్యార్థిని విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించాం.

– కంప్యూటర్‌, సైన్సు ల్యాబ్‌లు, గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం ద్వారా విద్యాసంస్థల్లో మరింతగా విద్యాప్రమాణాలను పెంచుతున్నాం.

ఎస్వీ మ్యూజియం :

– తిరుమలలో రూ.10 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపనుల్లో భాగంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శ్రీవారి ఆలయ వైభవాన్ని తెలిపేలా మే నెలలో ప్రదర్శన ఏర్పాటు చేస్తాం.

– టెక్‌ మహింద్రా సంస్థ సహకారంతో శ్రీవారి ఆభరణాల 3డి ఇమేజింగ్‌ను రూపొందించి ప్రదర్శించేందుకు చర్యలు చేపట్టాం.

దాతలకు ధన్యవాదాలు :

– టిటిడి నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు చాలామంది దాతలు విరివిగా విరాళాలిస్తున్నారు. ఉదాహరణకు 2019వ సంవత్సరంలో లక్షా 38 వేల మంది దాతలు దాదాపు రూ.366 కోట్లు విరాళాలందించారు. వీరందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

టిటిడి ఉద్యోగులు :

– జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి వరకు గల ఉద్యోగాల్లో చిత్తూరు జిల్లాకు 75 శాతం కేటాయించాలని టిటిడి బోర్డు నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాలు అందిన తరువాత అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తాం.

– ఈలోగా జూనియర్‌ అసిస్టెంట్‌ పైస్థాయిలో విభాగాల వారీగా అవసరమైన పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించాం.

– టిటిడి ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్లస్థలాల కోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ బోర్డు చేసిన తీర్మానం మేరకు చర్యలు తీసుకుంటున్నాం.

– అదేవిధంగా, ఉద్యోగులకు రూ.10 కోట్లతో ఇండోర్‌ స్టేడియం మంజూరుచేశాం.

– ఉద్యోగులు మరింత ఆదర్శవంతంగా సేవలందించి భక్తుల మన్ననలు పొందాలని కోరుతున్నాను.

– ఆ కలియుగ వేంకటేశ్వరుడు యావత్‌ ప్రపంచానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను…..జైహింద్‌.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.