TULASI DAMODARA PUJA HELD _ వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా శ్రీతులసి దామోద‌ర పూజ‌

TIRUMALA, 24 NOVEMBER 2023:On the auspicious Uttana Dwadasi also known as Kaisika Dwadasi, Tulasi Damodara Puja was held on Friday evening at Vasanta Mandapam.

As part of special festivities in Karthika Masam, Karthika Vishnupuja Sankalpam, Samasta Devataradhana, Krishna Astottara Satanamavali were rendered in front of Utsava deities of Srivaru with Sridevi and Bhudevi.

Facing the Utsava deities Tulasi (Holy Basil) and Usiri (Amla) trees were placed. Archaka Sri Ramakrishna Seshasai explained about the importance of Sri Tulasi Damodara Puja.

Dharmagiri Veda Pundits and devotees participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా శ్రీతులసి దామోద‌ర పూజ‌

తిరుమ‌ల‌, 2023 న‌వంబ‌రు 24 ; కార్తీక మాసంలో టీటీడీ త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా కైశిక ద్వాద‌శిని పుర‌స్క‌రించుకుని శుక్రవారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ తులసి దామోద‌ర పూజ‌ ఘనంగా జరిగింది. మ‌ధ్యాహ్నం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ముందుగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఎదురుగా తుల‌సి, ఉసిరి వృక్షాల‌ను కొలువుదీర్చారు. ఈ సంద‌ర్భంగా పురాణ పండితులు శ్రీ రామకృష్ణ శేషసాయి మాట్లాడుతూ శ్రీ తుల‌సి దామోద‌ర పూజ విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. కార్తీక మాసంలో ఈ పూజ చేయ‌డం వ‌ల్ల పితృదేవ‌త‌లు విష్ణుసాన్నిధ్యాన్ని చేరుతార‌ని, కోటి జ‌న్మ‌ల పుణ్య‌ం ల‌భిస్తుంద‌ని చెప్పారు. తుల‌సిని పూజిస్తే గ్ర‌హ‌బాధ‌లు తొల‌గుతాయ‌ని, స‌క‌ల ఐశ్వ‌ర్యాలు చేకూరుతాయ‌ని వివ‌రించారు.

అనంత‌రం కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం, బ్ర‌హ్మాది దేవ‌త‌ల‌కు ఆరాధ‌న చేశారు. ఈ సంద‌ర్భంగా పండితులు కృష్ణ అష్టోత్త‌ర శ‌త‌నామావ‌ళిని పారాయ‌ణం చేశారు. నివేద‌న‌, క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల వేద‌పండితులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.