TULASI UTSAVAM IN SRI GT _ జూలై 30న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం
TIRUPATI, 27 JULY 2023: Sri Tulasi Mahatmya Utsavam will be observed in Sri Govindaraja Swamy temple in Tirupati on July 30.
On the auspicious day of Suddha Dwadasi, this festival will be observed.
In the morning Sri Govindaraja will take a celestial ride on Garuda Vahanam along the temple streets.
Later Asthanam will be performed where in archakas will recite Tulasi Mahatmyam Shlokas and episode.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 30న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం
తిరుపతి, 27 జూలై 2023: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 30వ తేదీ తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది.
స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.