TUMBURU THEERTHA MUKKOTI ON MARCH 18 _ మార్చి 18న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

TIRUMALA, 12 MARCH 2022:The auspicious Tumburu Theertha Mukkoti festival will ve observed in Tirumala on March 18.

After two years, TTD will be allowing pilgrims for Tumburu Theertham as the Covid restrictions are relaxed by central and state governments.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 18న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

తిరుమల, 2022 మార్చి 12: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ళ దూరములో వెలసివున్న ప్రముఖ పుణ్యతీర్థమగు శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 18వ తారీఖున అత్యంత వైభవంగా తిరుమలలో జరుగనుంది. కోవిడ్ -19 కార‌ణంగా దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌రువాత ఈ పుణ్యతీర్థానికి భ‌క్తులను అనుమతించునున్నారు.

పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నవని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి, ప్రధానమైనవి 7 తీర్థములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థములు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరించిన యెడల సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరునని పురాణ వైశిష్ట్యం.

పాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.