TWO MORE TAKE OATH AS TTD BOARD MEMBERS _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ కె.సంజీవ‌య్య‌ ప్రమాణస్వీకారం

TIRUMALA, 23 SEPTEMBER 2021:  Two more took oath as the Trust Board members of TTD on Thursday in Srivari temple at Tirumala.

 

Sri Pokala Ashok Kumar and Sri Sanjeevaiah were administered oaths by TTD Additional EO Sri AV Dharma Reddy at Bangaru Vakili in Tirumala temple.

 

After darshan Sri Venkateswara Swamy, they were rendered Vedasirvachanam by Vedic Pundits and presented with Theerthaprasadams, laminated photo of Srivaru, and Coffee Table book on TTD.

 

Deputy CM Sri Narayanaswamy was also present and congratulated both the Board members.

 

CVSO Sri Gopinath Jatti, Deputy EOs Sri Ramesh Babu, Smt Sudharani, Sri Lokanatham were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ కె.సంజీవ‌య్య‌ ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 23: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ కె.సంజీవ‌య్య గురువారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ నారాయ‌ణ‌స్వామి ఈ ఇరువురు బోర్డు స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, శ్రీ లోక‌నాథం, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.