TWO VIs FELICITATED _ పదోన్నతిపై వి.ఐల బదిలీ
తిరుమల, 18 ఫిబ్రవరి – 2013: గత నాలుగేళ్ళుగా తిరుమల శ్రీవారి ఆలయంలో అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో ఉత్తమ ప్రతిభను కనబరిచి విజిలెన్సు ఇన్స్పెక్టర్లుగా విధులను నిర్వర్తించిన శ్రీ యం. వెంకటరాం మరియు శ్రీ పి.రామకృష్ణలు పదోన్నతిపై బదిలీ అయిన సందర్భంగా తి.తి.దే నిఘా మరియు భద్రతా విభాగం ఇరువురినీ ఘనంగా సన్మానించింది.
తి.తి.దే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి అయిన శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్ ఈ ఇరువురు వి.ఐల సేవలను ప్రశంసించారు. సి.ఐలుగా పదోన్నతి చెందిన సందర్భంగా వీరిని అభినందించారు. ఇదే రీతిలో తమవిధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తిరుమలలోని విజిలెన్సు కార్యాలయంలో శ్రీ అశోక్‌కుమార్ ఇరువురిని దుశ్శాలువలతో సత్కరించారు.
తి.తి.దే నుండి బదిలీపై వెళుతున్న ఈ ఇరువురు భద్రతాధికారులకు తి.తి.దే అదనపు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్ రెడ్డి, అదనపు ఎస్.పి, తిరుమల శ్రీ సుబ్బిరామిరెడ్డి, డి.ఎస్.పి శ్రీ నంజుండప్ప, ఏ.వి.ఎస్.ఓలు శ్రీ విశ్వనాథం, శ్రీమల్లిఖార్జున, శ్రీసాయిగిరిధర్, శ్రీ కాటంరాజు, వి.ఐ శ్రీ సుబ్రహ్మణ్యంలు అభినందనలు తెలియజేశారు.
–
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.