TYAGARAJA ARADHANOTSAVAM ON JAN 12 _ జనవరి 12న ఎస్వీ సంగీత కళాశాలలో శ్రీత్యాగరాజస్వామివారి 176వ ఆరాధనోత్సవం 

TIRUPATI, 11 JANUARY 2023: The 176th Aradhana Mahotsavam of Saint Musician Sri Tyagaraja Swamy will be observed in Sri Venkateswara College of Music and Dance in Tirupati on January 12.

Tyagaraja Pancharatna Kritis will be rendered between 10am and 1pm in the Open Auditorium at the College by the faculty and students of the college akin to Tiruvayur Aradhanotsavams.

Principal Sri Sudhakar is supervising the arrangements for the same.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 12న ఎస్వీ సంగీత కళాశాలలో శ్రీత్యాగరాజస్వామివారి 176వ ఆరాధనోత్సవం
 
తిరుపతి, 2023 జనవరి 11: ప్రముఖ వాగ్గేయకారుడైన కర్ణాటక సంగీత సామ్రాట్‌ శ్రీత్యాగరాజస్వామివారి 176వ ఆరాధనోత్సవం జనవరి 12వ తేదీ గురువారం తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాలలో జరుగనుంది. శ్రీత్యాగరాజస్వామివారు పుష్యబహుళ పంచమి నాడు పరమపదించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాగ్గేయకార వైభవం కార్యక్రమంలో భాగంగా టిటిడి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
 
ఇందులో భాగంగా కళాశాలలోని ఓపెన్ ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఘనరాగ పంచరత్న కృతులు, ఉత్సవ సంప్రదాయ, దివ్యనామ సంకీర్తనలను తిరువయ్యార్ పద్ధతిలో బృందగానం చేస్తారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.