UGADI ASTHANAM AT SRIVARI TEMPLE ON MARCH 25 _ మార్చి 25న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Tirumala, 11 Mar. 20: TTD is organising a grand Sri Sarwari Nama Ugadi Asthanam at Srivari temple on March 25.

After daily rituals in the morning new sesha vastram will be adorned the Mula Virat and utsava idols followed by Panchanga sravanam by TTD Purana scholar. Later the Vedic pundits and archakas will perform Ugadi Asthanam at the Bangaru vakili.

In view of the spate of rituals on Ugadi festivities, TTD has cancelled all Arjita sevas like Sahasra Kalashabisekam, Kalyanotsavam, Unjal Seva, Vasantotsavam and Arjita Brahmotsavam.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

 

మార్చి 25న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల, 2020 మార్చి 11: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తేదీ శ్రీ శార్వ‌రి నామ  సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జ‌రుగ‌నుంది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 25వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన స‌హ‌స్ర క‌ల‌‌శాభిషేకం, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.