UGADI CELEBBRATIONS IN PAT ON APRIL 2 _ ఏప్రిల్ 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

TIRUPATI, 25 MARCH 2022: In view of Subhakrutnama Samvatsara Ugadi on April 2, special festivities will be observed in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor.

 

As part of it special Abhishekam will be performed to the processional deity of Ammavaru in Sri Krishna Mukha Mandapam between 3 p.m. and 4 p.m.

 

Later in the evening, Goddess Padmavati will be taken on a celestial ride in Pushpa Pallaki alarm four models to its between 6:00 p.m. and 7:30 p.m.

 

Panchanga Shravanam and Ugadi Asthanam will be observed between 8pm and 8:30p.m.

 

Similar festivities will be observed in Sri Suryanarayana Swamy temple also on the same day.

 

TTD has cancelled VIP break Darshan and Unjal Seva on that day.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

 తిరుపతి, 2022 మార్చి 25: సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామ అర్చన, నిత్యార్చ‌న‌ నిర్వహిస్తారు. మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.

అదేవిధంగా శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో ఉగాది సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం, సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సందర్భంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, ఆర్జితసేవలైన ఊంజ‌ల్‌ సేవను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది