UGADI CELEBRATIONS IN MAHATI ON APRIL 9 _ ఏప్రిల్ 9న‌ మహతిలో ఉగాది సంబరాలు

Tirupati, 07 April 2024: Under the joint auspices of TTD Hindu Dharmapr Prachara Parishad and Welfare Department of TTD, Sri Krodhinama Ugadi celebrations will be held on April 9 at Mahathi Auditorium in Tirupati.

As part of this, programs will start at 9.30 am with Mangaladhwani under the auspices of SV College of Music and Dance, followed by Veda Parayanam by SV Institute of Higher Vedic Studies.

On this occasion, Sri Vedantam Vishnu Bhattacharya will render Panchanga Shravanam at 10 am.  

After Ashtavadhanam, “Telugu Vaithalikulu” fancy dress competitions and cultural programs will be organized with the children of TTD employees.  

Prizes are awarded to the kids of employees who are the winners of various competitions.  After that Ugadi Pachchdi Prasadam will be distributed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 9న‌ మహతిలో ఉగాది సంబరాలు

తిరుప‌తి, 2024 ఏప్రిల్ 07: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 9వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థవారిచే వేదపారాయణం నిర్వహిస్తారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తారు. అనంత‌రం అష్టావధానం, టీటీడీ ఉద్యోగుల పిల్లలతో ”తెలుగు వైతాళికులు” వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.