“PRAYED HILL GOD TO BLESS THE COUNTRY TO EMERGE AS A POWERFUL NATION”-UNION MINISTER _ శ్రీవారి ఆశీస్సులతో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని ప్రార్థించా- శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ

TIRUMALA, 13 JULY 2023: The Honourable Union Minister for Road Transport and Highways Sri Nitin Gadkari said that he prayed to Sri Venkateswara Swamy to bless India to become a powerful nation bestowed with prosperity.

 

After having the darshan of Sri Venkateswara Swamy in Tirumala temple during the early hours on Thursday, speaking to media persons outside the Tirumala temple he said he was blessed to have the Darshan of Srivaru along with his family.

 

“I prayed Bhagawan Sri Venkateswara to give me more strength to serve the people of my country. With the benign blessings of Sri Venkateswara the country will soon emerge into a biggest powerful nation”, he asserted.

 

Earlier he was accompanied by TTD Trust Board Chairman Sri YV Subba Reddy for darshan of Sri Venkateswara.

 

After darshan, he was offered Vedasirvachanam by Vedic pundits at Ranganayakula Mandapam. Later the Chairman presented Theertha Prasadams, photo of Srivaru to the dignitary.

 

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆశీస్సులతో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని ప్రార్థించా

– శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ

తిరుమల, 2023 జూలై 13: భారతదేశం సుసంపన్న, శక్తివంతమైన దేశంగా అవతరించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, “నా దేశ ప్రజలకు సేవ చేయడానికి నాకు మరింత శక్తినివ్వాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించిన్నట్లు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో దేశం త్వరలో అతిపెద్ద శక్తివంతమైన దేశంగా ఆవిర్భవిస్తుంది” అని ఆయన చెప్పారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, ఓఎస్డీ శ్రీ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది