UNION MINISTER OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గౌ|| శ్రీ ప్రహ్లాద్ జోషి
Tirumala, 5 Oct. 20: The Union Minister for Coal, Mines & Parliamentary Affairs Shri Pralhad Joshi had darshan of Lord Venkateswara on Monday at Tirumala temple.
Earlier, he was accorded warm welcome by the TTD EO (FAC) Sri AV Dharma Reddy upon his arrival at the entrance of the temple.
Later the Union Minister was rendered Vedashirvachanam by Vedic pundits and was presented Srivari Thirthapsadams and lamination of Lord Venkateswara. Later he took part part in sundarakanda pathanam at Nadaneerajanam mandapam.
Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohanachary, Reception Officials Sri Balaji, Sri Prabhakara Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గౌ|| శ్రీ ప్రహ్లాద్ జోషి
అక్టోబరు 05, తిరుమల 2020: కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి గౌ|| శ్రీ ప్రహ్లాద్ జోషి సోమవారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ఈవో(ఎఫ్ఏసి) శ్రీ ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీ ప్రహ్లాద్ జోషికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
అనంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన సుందరకాండ పారాయణంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సోమవారం నాటికి సుందరకాండ పారాయణం 117వ రోజుకు చేరుకుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మాజీ సభ్యులు శ్రీ భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.