UNIQUE ART FORMS FROM VARIOUS STATES 

JUGALBANDI OF FINE ARTS DURING NAVARATRI FESTIVITIES 

TIRUMALA, 18 OCTOBER 2023: The array of fine art forms displayed infront of morning and evening vahana sevas during the ongoing Navaratri Brahmotsavams have been receiving an overwhelming reception from the devotees. Each day, a set of artists representing one specific state are presenting their art forms. On the day of Gaurda Seva on October 19, artists from 14 states across the country are set to showcase their skills.

In this connection, the JEO for Health and Education Smt Sada Bhargavi organised a press conference with the leaders of each team representing each state at Annamaiah Bhavan on Wednesday evening. The representative of each state shared their experience to the media.

Smt Poorna Pushkala, Director of the Fine Arts and Culture department of Tamilnadu led the press briefing introducing troupe leaders from each state. All the representatives thanked TTD management for providing them a divine opportunity to perform live before Vahana sevas and taking care of their boarding, lodging facilities. 

For the first time unique dance forms including Khoria, Jhumar from Haryana, Khamba Thoibi of Manipur, Gudum Baja, Baredi dance forms of MP, Baul dance of West Bengal, Bihu of Assam, Kalbeliya, Ghoomar dances of Rajastan, Sambhalpuri of Odisha, Lavni, Songi Mukhota of Maharastra besides Bharat Natyam of Tamilnadu, Kuchipudi and Garagalu from Andhra Pradesh, Telangana folk dances, which are being performed in front of the procession of Vahana sevas. 

SVVU VC Acharya Ranisadasiva Murty, All Projects Program Officer Sri Rajagopal, Dasa Sahitya Project Special Officer Sri Ananda Thirthacharyulu, team leaders of all the states were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

వివిధ రాష్ట్రాల నుండి ప్రత్యేక కళారూపాలు

– నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో కళల జుగల్బందీ

తిరుమల, 2023 అక్టోబ‌రు 18: వరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉదయం, రాత్రి వాహనసేవల్లో వివిధ రాష్ట్రాల కళారూపాల ప్రదర్శనకు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతి రోజూ ఒక్కో రాష్ట్రం నుండి కళాకారులు వారి స్థానిక సంప్రదాయ, జానపద కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19న విశేషమైన గరుడ సేవ నాడు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి ఆయా రాష్ట్రాల కళాబృందాల నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఆయా రాష్ట్రాల కళాకారులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తమిళనాడులోని ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ శ్రీమతి పూర్ణ పుష్కళ ట్రూప్ లీడర్‌లను పరిచయం చేశారు. స్వామివారి వాహనసేవలో ప్రదర్శనకు అవకాశం కల్పించడంతోపాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పించినందుకు టీటీడీ యాజమాన్యానికి ప్రతినిధులందరూ కృతజ్ఞతలు తెలిపారు.

గరుడ సేవలో హర్యానా నుండి ఖోరియా, ఝుమర్, మణిపూర్‌ నుండి ఖంబా థోయిబి, మధ్య ప్రదేశ్ నుండి గూడుమ్ బాజా, బరేడీ నృత్య రూపాలు, పశ్చిమ బెంగాల్‌ నుండి బౌల్ డ్యాన్స్, అస్సాం నుండి బిహు, రాజస్థాన్‌ నుండి కల్బెలియా, ఘూమర్ నృత్యాలు, ఒడిశా నుండి సంభల్‌పురి నృత్యం, మహారాష్ట్ర నుండి లావణి, సోంగి ముఖోటా నృత్యాలు, తమిళనాడు నుండి నెమలి భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ నుండి కూచిపూడి, గరగలు, తెలంగాణ జానపద నృత్యాలను ప్రదర్శిస్తారు.

ఎస్వీ వేద వర్సిటీ వీసీ ఆచార్య రాణి సదాశివమూర్తి, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు, అన్ని రాష్ట్రాల టీమ్ లీడర్లు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.