UNIQUE SAHASRA KALASABHISHEKAM PERFORMED AT SVV _ నెల్లూరులో శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం
NELLORE, 17 AUGUST 2022: As part of the ongoing Sri Venkateswara Vaibhavotsavams in the spacious AC Subba Reddy Stadium at Sri Potti Sriramulu Nellore District, the unique Sahasra Kalasabhishekam was performed with utmost religious fervor on Wednesday.
The significance of this ritual is that Pallava Queen Samavai consecrated the one-foot silver idol of Sri Bhoga Srinivasa Murthy(a replica of the Chief deity) in the later half of the 7th Century.
Marking the historical moment, special Sahasra Kalasabhishekam is being observed in Tirumala temple once a year where abhisheka is performed to the uthsava deities of Srivaru, Sridevi, and Bhudevi along with Sri Bhoga Srinivasa Murthy with sacred water in 1000 Kalasams. Snapana Tirumanjanam was also performed to the Utsava deities.
While performing this ritual, the priests tie a holy thread to the presiding deity in Garbha Gruha at one end and another end to Sri Bhoga Srinivasa Murthy. This implies that whatever abhisheka is performed to the Silver idol is also done to the main deity.
This ritual was performed between 8.30 am and 10 am amidst chanting of Vedic hymns by the Archakas. Earlier, during the day, akin to the first day, the awakening ritual of Srivaru, Suprabhatam was performed. Later from 10:30 am onwards, Thomala, Koluvu, and Archana are performed. From 11.30 am till 5.30 pm Sarva Darshanam will continue for devotees while in the evening Unjal Seva will be performed followed by evening Kainkaryams.
The Honourable Minister for Agriculture Sri K Govardhan Reddy participated in the second-day rituals. Among others, Rajya Sabha MP Sri Vemireddi Prabhakar Reddy, New Delhi LAC Chief Smt Prasanthi Reddy, one of the Pradhana Archakas of Tirumala Sri Venugopala Deekshitulu, Annamacharya Project Director Dr. Vibhishana Sharma, AVSO Sri Narayana, and other officials were also present.
ISSUED BY TTD’s PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నెల్లూరులో శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం
నెల్లూరు, 2022, ఆగస్టు 17 ;నెల్లూరులో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
నెల్లూరులోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.
సహస్రకలశాభిషేకం : ఉదయం 8.30 నుంచి 10.00 గంటల వరకు
భోగశ్రీనివాసమూర్తితోపాటు, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ శ్రీనివాసస్వామి వారికి వెయ్యి కలశాలతో సహస్రకలశాభిషేకం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఉత్తరాభిముఖంగా ఉంచి, భోగశ్రీనివాసమూర్తిని తూర్పుముఖంగా ఉంచారు. మూలమూర్తి నుండి భోగ శ్రీనివాసమూర్తికి పట్టుదారం కట్టి ఉంచారు.
పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనము తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశేషహోమం నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించి భక్తులను ఆశీర్వదించారు. సహస్ర(1000) కలశాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు కావున, ఈ సేవకు ‘సహస్ర కలశాభిషేకం’ అనే పేరు ఏర్పడింది. ఈ సహస్రకలశాభిషేకం ఉత్తమోత్తమ అభిషేక విధానమని ఆగమశాస్త్రంలో పేర్కొనబడింది.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు తోమాలసేవ, అర్చన, రెండో నివేదన, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.
రేపటి ప్రత్యేక సేవ….
వైభవోత్సవాల్లో భాగంగా ఆగస్టు 18న గురువారం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు తిరుప్పావడ సేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, ఎవిఎస్వో శ్రీ నారాయణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.