UPGHAT WORKS TO BE COMPLETED BEFORE DEC END-CHAIRMAN TO IIT AND ENGG. OFFICIALS _ నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్ మరమ్మతులు పూర్తి చేయాలి

ALLOW VEHICLES THROUGH LINK ROAD FROM DEC 4 ONWARDS

Tirumala, 03 December 2021:  The restoration works of the Second ghat (Up Ghat) road, side walls which have been destroyed in majority areas due to the recent unprecedented rains should be restored before December end, directed TTD Chairman Sri YV Subba Reddy.

In a review meeting with IIT experts and TTD Engineering officials in Sri Padmavathi Rest House at Tirupati on Friday, the Chairman said due to recent rain havoc, heavy boulders have fallen in the second Ghat road critically destroying the Ghat road. He sought the officials to ensure measures that the remaining part of the destroyed hillock does not fall on the ghat road. As the devotees are forced to wait for hours together at Alipiri and Link Bus stand and in Tirumala due to movement of vehicles only through down ghat road, he also instructed the officials to allow vehicles to Tirumala through link road from Saturday onwards after a thorough inspection and initiating necessary measures. 

The Chairman instructed the officials to remove the hillocks which are ringing danger bells immediately by using Chemical Technology. He also said, the safety of devotees is most important and there is no need to think on expenditure in ensuring safety measures. 

TTD Trust Board member Sri P Ashok Kumar, Additional EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, IIT Expert from New Delhi Sri Rao, Engineering Advisor Sri Ramachandra Reddy, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadishwar Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్ మరమ్మతులు పూర్తి చేయాలి

– శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలు పంపేందుకు ఏర్పాట్లు చేయండి

ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 3 డిసెంబరు 2021: భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో ఛైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్ ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన భారీ కొండ చరియ లోని మిగిలిన సగా భాగం రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బంది లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల భద్రత ముఖ్యమని ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదని శ్రీ సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు. డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాక పోకలు సాగుతున్నందువల్ల అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమల లో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్నారు. వీరి ఇబ్బందులు తొలగించడానికి లింక్ రోడ్డు మీదుగా తిరుమల కు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో లు శ్రీమతి సదా భార్గవు, శ్రీ వీరబ్రహ్మం, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఢిల్లీ ఐఐటి నిపుణులు శ్రీ రావు, ఇంజినీరింగ్ సలహా దారు శ్రీ రామచంద్రా రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ శ్రీ జగదీశ్వర రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది