UPI PAYMENTS FOR MORE TRANSPARENCY-TTD EO_ యువకులైన శ్రీవారి సేవకులు వేసవిలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలి: డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

TIRUMALA, 04 JUNE 2023: The monthly Dial your EO programme was held at Annamaiah Bhavan in Tirumala on Sunday.

 

TTD EO Sri AV Dharma Reddy received feedback from 18 different pilgrim callers from across the country in this live phone-in programme. Some excerpts:

 

When a pilgrim caller Sri Sadasivudu from Warangal sought EO to consider cash payments instead of UPI for rural devotees, the EO replied to him TTD has introduced UPI payments for more transparency. “Even the Government of India is also encouraging cashless transactions”, he answered.

 

Another pilgrim caller from Dubai Sri Haribabu suggested EO to enhance vigil as many prohibited items like cigarette packets, pan were seen in toilets at Tirumala during his last visit.

Answering the caller the EO said, we will definitely enhance the vigil. But it is also the duty of every devotee of Srivaru to adhere to TTD norms. To protect the sanctity of Tirumala TTD has formulated certain norms which includes the Do’s and Don’ts, carrying of certain prohibited items etc. Devotees also should extend their co-operation”, he maintained.

 

A caller Smt Rajeswari from Proddutur sought EO to issue Divya Darshan tokens at Galigopuram to which EO replied it is not possible as that might result in a stampede due to the convergence of large number of devotees.

 

When a caller Sri Madhu from Hyderabad suggested EO to have a separate WhatsApp number for raising authentic complaints, the EO replied him already it exists besides Call Centre.

 

Sri Namala Swamy from Kakinada sought EO to release the online quota for Srivari Seva vacancies or cancellation, to which EO answered him the suggestion will be looked into. The EO also gave a call to the youth to form a group to offer services in Tirumala shrine during the summer vacation alone as an unprecedented pilgrim rush is being witnessed.

 

A caller Sri Dinesh from Vijayawada brought to the notice of EO that the maintenance of Asta Vinayaka Rest House needs to be reformed to which EO said already actions have been initiated which will be implemented in a few days.

 

When Sri Raja Rao of Nandyal suggested EO of a separate door besides Vendi Vakili to avoid pilgrim congestion, the EO said this has been a challenge for all the Administrators since several decades since it involves Agama. “For any change to be brought in the temple complex, it needs the approval of Agama Advisors, Pontiffs otherwise it invites serious criticisms. Even our predecessors have also tried in vain as it is a very sensitive issue”, he asserted.

 

Sri Pridhviraj from Karimnagar sought EO to enhance free buses in Tirumala to which EO answered him that already 10 buses are operating and another six will add to tge fleet soon.

 

Among others, Sri Murali Mohan and Sri Narsinga Rao from Vizag, Sri Ramesh Reddy from Chennai, Sri Ashok and Sri Kiran Kumar from Tirupati, Sri Nagavilas from Ongole, Sri Sairam from Bhadradri, Sri Srinivas, Sri Visveswaraiah and Sri Raghuram from Hyderabad have also made some valuable suggestions to which the EO replied the probabilities will be looked into.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and other senior officers were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 



యువకులైన శ్రీవారి సేవకులు వేసవిలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలి:

– డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023 జూన్ 04: యువకులైన శ్రీవారి సేవకులు వేసవిలో క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆదివారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. నామాల స్వామి – కాకినాడ

ప్రశ్న : శ్రీవారి సేవకు మూడు నెలలు ముందు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న సేవ దొరకడం లేదు. సేవకు నిలిచిపోయిన వారి స్థానంలో తర్వాత వారికి సేవ కేటాయించండి.

ఈవో : పరిశీలిస్తాం.

2. అశోక్‌ – తిరుపతి

ప్రశ్న : శ్రీవారి ఆలయంలో తోసేస్తున్నారు.

ఈవో : వేసవిలో రద్దీ అధికంగా ఉండడం వల్ల 40 నుండి 50 గంటల సమయం భక్తులు దర్శనం కోసం వేచివున్నారు. కావున త్వరగా దర్శనం చేసుకుని తరువాత భక్తులకు అవకాశం ఇవ్వాలి.

3. హరిబాబు – దువ్వాడ

ప్రశ్న : మాడవీధుల్లో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. మరుగుదొడ్లలో ధూమపానం చేస్తున్నారు. దీనివల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతోంది.

ఈవో : తిరుమలకు ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వస్తున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తులు తమ అలవాట్లను మార్చుకోవాలి. అదేవిధంగా నిషేధిత వస్తువులు తీసుకురాకుండా చర్యలు తీసుకుంటాం.

4. మధు – హైదరాబాద్‌

ప్రశ్న : తిరుమలలో తమకు ఎదురయ్యే సమస్యలు ఫిర్యాదు చేయడానికి వాట్సాప్‌ నెంబర్‌ తెలపండి.

ఈవో : టిటిడిలో కాల్‌ సెంటర్‌, తిరుమలలో మొబైల్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫిర్యాదు చేయవచ్చు.

5. రాజేశ్వరి – ప్రొద్దుటూరు

ప్రశ్న : గాలిగోపురం వద్ద దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వండి. కింద ఇవ్వడం వల్ల అధిక సమయం వేచి ఉండవలసివస్తోంది.

ఈవో: గాలిగోపురం వద్ద స్థలాభావము, తోపులాట, భక్తుల మధ్య గొడవలు జరగడం వల్ల అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్‌కు మార్చడం జరిగింది.

6. రమేష్‌ రెడ్డి – చెన్నై

ప్రశ్న : టిటిడి కల్పిస్తున్న వసతి, దర్శనం, అన్నప్రసాద సౌకర్యాలు బాగున్నాయి. కానీ శ్రీవారి ఆర్జిత సేవలు దొరకడం లేదు.

ఈవో: ప్రతి నెలా ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా ఆర్జిత సేవలు విడుదల చేస్తున్నాం. తిరుమలలో లక్కీ డిప్‌ ద్వారా, జెఈవో కార్యాలయంలో విచక్షణ కోట ద్వారా కూడా సేవా టికెట్లు పొందవచ్చు.

7. మురళీ మోహన్‌ – వైజాగ్‌

ప్రశ్న : సుందరకాండ, భగవద్గీత శ్లోక పారాయణం, అర్ధతాత్పర్యాలు యూట్యూబ్‌ నుండి తీసివేశారు. దానిని పొందే మార్గం తెలియజేయగలరు.

ఈవో: సుందరకాండ, భగవద్గీత, యోగశాస్త్రం అర్ధ తాత్పర్యాలతో యూట్యూబ్‌లో ఎలా పొందాలో మీకు తెలియజేస్తాం. అదేవిధంగా భాగవతం కూడా చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.

8. దినేష్‌ ` హైదరాబాద్‌

ప్రశ్న : లక్కీ డిప్పు బయోమెట్రిక్‌ స్థానంలో మిషన్‌ పెడితే అధిక సమయం వేచి ఉండవలసిన అవసరం ఉండదు. మొబైల్‌ ఓటిపి ద్వారా టికెట్లు పొందే అవకాశాన్ని పరిశీలించండి. అష్ట వినాయక విశ్రాంతి భవనంలో అద్దె 1500 /- వసూలు చేస్తున్నారు. సౌకర్యాలు అంతగా లేవు.

ఈవో: అష్ట వినాయక విశ్రాంతి భవనంలో ఆధునీకరణ పనులు జరగుతున్నాయి. అద్దె రేట్లు తగ్గిసాం. లక్కీ డిప్‌ మిషన్‌ ఏర్పాటును పరిశీలిస్తాం.

9. నాద విలాస్‌ ` ఒంగోలు

ప్రశ్న : కోవిడ్‌ సమయంలో అలిపిరి వద్ద టికెట్లు స్కాన్‌ చేయడం వల్ల, తిరుమలకు వచ్చేటప్పటికి గదులు దొరుకుతున్నాయి. అదే విధానము ప్రవేశపెట్టండి.

ఈవో: కోవిడ్‌ సమయంలో దర్శనం టికెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతించాం. ప్రస్తుతం అందరిని తిరుమలకు అనుమతిస్తున్నాం. కావున దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం.

10. సదాశివుడు ` వరంగల్‌

ప్రశ్న : గదులు కేటాయించే సమయంలో అద్దె, కాషన్‌ డిపాజిట్‌ ఫోన్‌ పే చేయమంటూన్నారు. నగదు తీసుకునేలా ఏర్పాటు చేయండి.

ఈవో: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగదు లావాదేవీలు తగ్గించేందుకు, సిబ్బంది ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు, సులభంగా కాషన్‌ డిపాజిట్‌ రిఫండ్‌ చేయడానికి ఫోన్‌ పేను ప్రోత్సహిస్తున్నాం.

11. విశ్వేశ్వరయ్య ` హైదరాబాద్‌, రఘురాం ` హైదరాబాద్‌

ప్రశ్న : కళ్యాణోత్సవం చేసుకున్న భక్తులకు లడ్డు, వడ ప్రసాదాలు తగ్గించారు. ముందు మాదిరిగా ఇచ్చేలా చూడండి.

ఈవో: రెండు సంవత్సరాల క్రితం టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు ధర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి రూ.50 /- ఒక లడ్డు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. కావున అదనపు లడ్డులు కావలసిన భక్తులు రుసుం చెల్లించి తీసుకోవచ్చు.

12. రాజారాం – నంద్యాల

ప్రశ్న : వెండి వాకిలి వద్ద తొపులాట ఎక్కువగా ఉంటుంది. మరో ద్వారం ఏర్పాటు చేయండి.

ఈవో: గతంలో పని చేసిన ఈవోలు, జెఈవోలు మరో ద్వారం ఏర్పాటు చేయాలని ఆలోచించారు. అయినా సాధ్యం కాలేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం లేదు.

13. శ్రీనివాస్‌ – హైదరాబాద్‌

ప్రశ్న : చక్కర పొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి వంటి అన్నప్రసాదాలను భక్తులకు విక్రయించండి.
ఈవో: అన్నప్రసాదాల విక్రయం సాధ్యం కాదు.

14. పృధ్విరాజ్‌ – కరీంనగర్‌

ప్రశ్న : పిఏసిలు, వసతి గృహాల నుండి శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి ఉచిత ధర్మ రథాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయ్యండి.

ఈవో: ఇప్పటికే 10 ఎలక్ట్రిక్‌ బస్సులు, 2 డిజిల్‌ బస్సులు భక్తులను చేరవేస్తున్నాయి. త్వరలో మరో నాలుగు ధర్మ రథాలు రానున్నాయి. మొత్తం 16 బస్సులు ప్రతి రెండు నిమిషాలకు అందుబాటులో ఉంటాయి.


15. సాయిరాం – భద్రాది

ప్రశ్న : 70 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడం వల్ల వారితో వచ్చే సహయకులకు కూడా దర్శనానికి అవకాశం కల్పించండి.

ఈవో: భక్తుల కోరిక మేరకు వయోవృద్ధులు తిరుమలకు వచ్చి ఎక్కువ సమయం వేచి
ఉండకుండా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని నిర్ణీత సమయంలో దర్శనానికి రావచ్చు. నడవలేని వారికి బయోమెట్రిక్‌ ద్వారా శ్రీవారి సేవకుల సహకారంతో శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తాం.

16. కిరణ్‌ కుమార్‌ – తిరుపతి

ప్రశ్న : ఆన్‌ లైన్‌ లక్కీడిప్‌లో అభిషేక దర్శనం లేదు. వాటిని కూడా విడుదల చేయ్యండి.

ఈవో: ఇదివరకే అభిషేకం దర్శనం టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా భక్తులు బుక్‌ చేసుకున్నారు. కావున ప్రతి గురువారం తిరుమలలో లక్కీ డిప్‌ ద్వారా ఈ సేవా టికెట్లు పొందవచ్చు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.