USE ONLY THE OFFICIAL TTD WEBSITE FOR TICKET AND ACCOMMODATION BOOKINGS _ టికెట్లు, వసతి బుకింగ్‌ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌నే వినియోగించాలి
DO NOT TRUST MIDDLEMEN OR UNAUTHORIZED WEBSITES: TTD ADDITIONAL EO SRI CH.VENKAIAH CHOWDARY
Tirumala, 15 July 2026: TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary has appealed to devotees to book Srivari Darshan, accommodation, Arjitha Sevas, and other services only through the official TTD website.
He advised devotees not to fall prey to false propaganda circulated through social media platforms, unauthorized websites, or middlemen. He cautioned that some fraudsters are exploiting the faith of devotees by creating fake websites and collecting money through illegal means, and urged devotees to remain vigilant against such scams.
He stated that all official information regarding Srivari Darshan, accommodation, Seva bookings, ticket releases, availability of cancelled tickets, details of various Darshan categories, and current waiting time is regularly updated on the official TTD website. He also said that authentic information is continuously being disseminated to devotees through SVBC.
For any queries related to tickets, devotees may contact the TTD Call Centre at 155257, where complete and authentic information will be provided.
He further advised devotees never to transfer money to middlemen or unauthorized persons under any circumstances and not to believe their claims.
If any middlemen, agents, or unauthorized persons approach devotees in the name of bookings, devotees are requested to immediately inform the TTD Vigilance Complaint Cell at 9866898630. He warned that strict legal action would be initiated against such offenders.
Reiterating TTD’s commitment to transparency in Srivari services and the safety of devotees, Sri C.H. Venkaiah Chowdary urged devotees to avail all TTD services only through official channels.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టికెట్లు, వసతి బుకింగ్‌ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌నే వినియోగించాలి
మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు – టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి
తిరుమల, 2026 జూలై 15: తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్‌సైట్లలో, మధ్యవర్తుల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన భక్తులకు సూచించారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ వెబ్‌సైట్లు, అక్రమ మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేసే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, అలాంటి వారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
శ్రీవారి దర్శనం, వసతి, సేవల బుకింగ్‌లు, టికెట్ల విడుదల, రద్దు అయిన టికెట్ల లభ్యత, వివిధ దర్శనాల సమాచారం, వేచి ఉండే సమయం వంటి అన్ని వివరాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే ఎస్‌వీబీసీ ద్వారా కూడా భక్తులకు నిరంతరం అధికారిక సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు.
టికెట్లకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ కాల్ సెంటర్ నెం: 155257 సంప్రదించాలని, అక్కడ అధికారికంగా పూర్తి సమాచారం, స్పష్టత అందిస్తారని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తులకు లేదా అనధికారిక వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని భక్తులకు ఆయన సూచించారు.
ఎవరైనా మధ్యవర్తులు, దళారులు లేదా అనధికారిక వ్యక్తులు బుకింగ్‌ల పేరుతో సంప్రదించినట్లయితే వెంటనే టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు విభాగం ఫోన్ నెం: 9866898630 సమాచారం అందించాలని కోరారు. అటువంటి వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
శ్రీవారి సేవలో పారదర్శకత, భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అధికారిక మార్గాల ద్వారానే సేవలను పొందాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి భక్తులకు పునరుద్ఘాటించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది
