UTLA KRISHNA MUSES DEVOTEES _ ముత్యపుపందిరిపై ఉట్ల కృష్ణుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
Tiruchanoor, 25 Nov. 19: After donning Navaneetachora Krishna Alankara, on Monday morning, Goddess Padmavathi shined as Utla Krishna on Mutyapu Pandiri Vahanam.
The third day morning witnessed Goddess in Utla Krishna guise blessing the devotees in four mada streets.
Mutyapu Pandiri Vahanam symbolyses peace, tranquillity and serene love. Mother, who loves Her children, graced on the pearl canopy vahanam to shower Her benign blessings.
HH Sri Sri Pedda Jeeyar Swamy, HH Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri Anil Kumar Singhal, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy, VGO Sri Prabhakar, Agama Advisor Sri Srinivasa Charyulu, Arjitham Inspector Sri Srinivasulu and others took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ముత్యపుపందిరిపై ఉట్ల కృష్ణుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి, 2019 నవంబరు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీకృష్ణుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశాడు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.
మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వర్ ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.