హృద్యంగమయంగా సాగిన “వాద్యసంగీతం”


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

హృద్యంగమయంగా సాగిన “వాద్యసంగీతం”

తిరుపతి,15 సెప్టెంబరు2018 ; ఆనందనిలయుని బ్రహ్మోత్సవాలలో నేడు మూడవ రోజు. ఇందులో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో నేటి సాయంకాలం (15/9 /2018 ) బెంగుళూరుకు చెందిన రఘురామకృష్ణ వారి బృందం ‘వాద్యసంగీతం’ కార్యక్రమంలో వాయులీన,గిటార్,కంజీర,తబలా,మృదంగం,మోర్సింగ్, రిథమ్స్,వేణునాదంలతో సభను సమ్మోహ పరిచారు.

కార్యక్రమం తొలుత కనకదాస విరచిత వినాయక ప్రార్థన ‘గణేశస్తుతి’ తో ప్రారంభించారు. ఆపై అన్నమయ్య విరచిత ‘బ్రహ్మకడిగిన పాదము’, తదుపరి రామదాస కృత ‘పలుకే బంగారమాయెనా’ కీర్తనలు, అటు తర్వాత ‘వైష్ణవ జనకో’ భజనను,ఆపై పురందరదాస ‘ఓడి బారో వైకుంఠపతి’ కృతిని, ఆలపించి సభను మంత్రముగ్ధులను గావించాయి.

రఘురామకృష్ణ వాద్యమైన తబలాకు,మృదంగంపై నరసింహ అయ్యంగార్,వాయులీనంపై మధుసూదన్, గిటార్ పై సురేష్, కంజీరాపై సుబ్రహ్మణ్యం, మోర్సింగ్ – కార్తీక్,రిథమ్స్ పై మురళికామత్,ఫ్లూటుపై ప్రకాష్ హెగ్డేలు సహకరించి సభను భక్తి సంగీతసాగరంలో ముంచెత్తారు.

ఈ వాద్యసంగీత కార్యక్రమం తి తి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది.

తితిదేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహించిన ఈ వాద్యసంగీతంలో కో-ఆర్డినేటర్ పి. కృష్ణమూర్తి, తిరుపతి పుర భక్తజనులు పాల్గొన్నారు.

అలాగే తిరుపతి మహతి కళాక్షేత్రంలో సా.6.30 – 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన అభినయ ఆర్ట్స్ బృందంచే నృత్యం, తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో సా.6.30 -8.30 గంటల వరకు గుంటూరుకు చెందిన శ్రీ వీరరెడ్డి బృందంతో నామసంకీర్తన నిర్వహించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.