KODANDA RAMA GRACES ON ASWA VAHANA _ అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

తిరుపతి, 2023 మార్చి 27: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవరోజు సోమవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,
ఏఈవో శ్రీ మోహన్, సూప‌రింటెండెంట్ శ్రీ రమేష్ కుమార్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ సురేష్, శ్రీ చలపతి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUPATI, 27 MARCH 2023: The vahana sevas during the ongoing annual brahmotsavam in Sri Kodandarama Alayam in Tirupati has culminated with Aswa Vahanam.

HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, DyEO Smt Nagaratna, AEO Sri Mohan and other office staffs, devotees participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI